Begin typing your search above and press return to search.
అభిమాని తండ్రి చనిపోతే.. నవీన్ పొలిశెట్టి ఏం చేశాడో తెలుసా?
By: Tupaki Desk | 16 May 2021 2:30 PM GMTకరోనా మహమ్మారి దారుణాలకు అంతే లేకుండా పోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న వైరస్.. మన దేశంపై ఏ స్థాయిలోప్రభావం చూపిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ మారణహోమంలో ఆప్తులను పోగొట్టుకున్న వారు అల్లాడిపోతున్నారు. అప్పటి వరకూ కళ్లముందు కనిపించినవారు.. ఇక లేరని, ఎప్పటికీ తిరిగిరారనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక గుండె పగులుతున్నారు. అంతటి బాధను అనుభవిస్తున్న ఓ అభిమాని కుటుంబానికి తానున్నా అంటూ ధైర్యం ఇచ్చాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.
నెల్లూరుకు చెందిన నవీన్ అభిమాని సాయి స్మరణ్ తండ్రి ఇటీవలే కరోనాతో చనిపోయారు. దీంతో అతని తల్లి డిప్రెషన్లోకి వెళ్లిపోయిందట. ఎంతగా ప్రయత్నించినా.. తాను మామూలు మనిషిని చేయడం తమ వల్ల కాలేదని స్మరణ్ తెలిపాడు. ఈ సమయంలో తన తల్లికి ‘‘జాతి రత్నాలు’’ సినిమా చూపించాడట. ఆ సినిమా చూసిన తర్వాత ఆమె చాలా రిలీఫ్ ఫీలైందట.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పొలిశెట్టి దృష్టికి తీసుకెళ్లాడు సాయి స్మరణ్. వెంటనే స్పందించిన నవీన్ పొలిశెట్టి.. స్మరణ్ నంబర్ తీసుకొని వీడియో కాల్ చేశారు. వాళ్ల అమ్మతో మాట్లాడారు. ఇంటి పెద్దను కోల్పోతే ఎంతటి బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను అని చెప్పిన నవీన్.. ఇలాంటి కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇక నుంచి తాను కూడా మీ ఇంట్లో సభ్యుడినే అని చెప్పాడీ హీరో.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సాగిస్తున్న మారణకాండ ఎంతో దారుణమైందన్న నవీన్.. ఈ కష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తన వంతుగా అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నట్టు చెప్పారు నవీన్. కరోనా కష్టాల్లో ఉన్నవారితో మాట్లాడి మానసిక స్థైర్యం ఇవ్వాలని అందరికీ సూచించారు.