Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ 'జోక‌ర్-2' రిలీజ్ ఎప్పుడో తెలుసా?

By:  Tupaki Desk   |   12 Dec 2022 5:35 AM GMT
వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ జోక‌ర్-2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?
X
మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన 'జోక‌ర్' వ‌ర‌ల్డ్ వైడ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన గొప్ప హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. భార‌త్ లోనూ జోక‌ర్ అసాధార‌ణ వ‌సూళ్లు సాధించి ప్ర‌త్యేక చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ జోక్విన్ ఫోనిక్స్ న‌ట‌న‌కి..ఆహార్యానికి మ‌రోసారి ప్ర‌పంచం ఫిదా అయింది. జోక‌ర్ ముగింపులోనే 'జోక‌ర్ -2' కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్ .

దీంతో ఆ సినిమా ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కి సీక్వెన్స్ ఎప్పుడంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు వైర‌ల్ అయ్యాయి. వాటికి చిత్ర ద‌ర్శ‌క‌డుడు టాడ్ పిలిప్స్ స‌మాధానాలు చెప్ప‌లేక విసుగెత్తి ఏకంగా సోష‌ల్మీడియా అకౌంట్ల‌నే కొన్ని రోజుల పాటు బ్లాక్ చేసిన సంద‌ర్భం ఉంది.

అయితే ఇప్పుడా ఖాతాల్ని మ‌ళ్లీ యాక్టివేట్ చేసే స‌మ‌యం వ‌చ్చేసింది. ఆదివార‌మే లాంఛ‌నంగా 'జోక‌ర్ -2 : పోలీ యే డిక్స్' షూటింగ్ మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా హీరో పాత్ర ఫ‌స్ట్ లుక్ రివీల్ చేసారు. ఇందులో జోక‌ర్ వేషంలో ఉన్న జోక్విన్ తీక్ష‌ణంగా చూస్తున్న వైనాన్ని గ‌మ‌నించవ‌చ్చు. లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుటుంది. ఇందులో పాప్ స్టార్ లేడీగాగా కీల‌క పాత్ర పోషిస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాదంతా జ‌ర‌గ‌నుంది. అనంత‌రం 2024 లో కొన్ని నెలు పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు నిర్వహించ‌నున్నారు. అటుపై అక్టోబ‌ర్ 4 అదే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈసారి 'జోక‌ర్-2' రిలీజ్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డానికి అవకాశం ఉంది.

మొద‌టి భాగం ఎలాంటి అంచ‌నాలు లేకుండానే రిలీజ్ అయినా మంచి వ‌సూళ్ల‌ని సాధించింది. ఈ నేప‌థ్యంలో అధిక థియేట‌ర్ల‌లో 'జోక‌ర్ -2'ని రిల‌జ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. జోక్విన్ ఫోనిక్స్ హాలీవుడ్ లో ఇంకా ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నా..ఈ చిత్రాన్ని ముందుగా పూర్తిచేసి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారుట‌. ప్రేక్ష‌కుల ఆస‌క్తిని దృష్టిలో పెట్టుకునే ఆయ‌న ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.