Begin typing your search above and press return to search.

NTR30 కోసం గెస్టులు ఎవరో తెలుసా..?

By:  Tupaki Desk   |   20 Jan 2023 1:30 PM GMT
NTR30 కోసం గెస్టులు ఎవరో తెలుసా..?
X
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి ఎలాంటి సినిమా అప్డేట్ లేదు. తారక్ నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలిసినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేక జూనియర్ ఫ్యాన్స్ దిగాలుతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపే వార్త రానే వచ్చేసింది.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30 మూవీ స్క్రిప్ట్ పూర్తి కావడంతో ఇక సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అయిపోయింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ 30 కి ఫిబ్రవరి రెండో వారంలో ముహూర్త వేడుక నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన తర్వాత జూనియర్ నుండి రాబోతున్న చిత్రం కావడం అందులోనూ కొరటాల లాంటి హిట్ కాంబినేషన్ కావడంతో ముహూర్త వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు మూవీ టీం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, రాంచరణ్, రాజమౌళి ఫ్యామిలీ, ఆర్ఆర్ఆర్ మూవీ టీం మొత్తం NTR30 సినిమా ప్రారంభోత్సవానికి హాజరవ్వనున్నారని సమాచారం. చిరంజీవి వస్తారా లేదా అనేది తేలాల్సి ఉండగా, మిగతా వాళ్లు మాత్రం కచ్చితంగా వస్తారని మూవీ టీం చెబుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్‌లో ఈ వేడుక జరగనుంది.

ఈ సినిమా చాలా ఆలస్యంగా మొదలు కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి హీరోయిన్ వెతకడం. చాలా మంది హీరోయిన్లను అనుకున్న తర్వాత చివరికి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం మాత్రం నిర్మాతలు, దర్శకుడి నుండి రావాల్సి ఉంది.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఎన్టీఆర్ కు మంచి మైలేజీ ఇచ్చింది. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న జూనియర్ సినిమా కావడం అందులోని హిట్ కాంబినేషన్ కావడంతో NTR30పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.