Begin typing your search above and press return to search.
ఈసారి పెద్ద పండక్కి క్రౌడ్ పుల్లర్స్ మిస్ అయ్యారనే అనుకోవాలా..?
By: Tupaki Desk | 8 Jan 2021 5:30 PM GMTసంక్రాంతి పండుగ అంటే సినీ ఇండస్ట్రీకి సినిమా పండుగ. సాదారణ పరిస్థితుల్లో ప్రతి ఏడాది పెద్ద పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటాయి. కోవిడ్ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి సినిమాల థియేట్రికల్ రిలీజులు ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో నాలుగు సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో వస్తున్నట్లు ప్రకటించాయి. మాస్ మహారాజ్ 'క్రాక్' రేపు (జనవరి 9) రిలీజ్ అవుతుండగా.. విజయ్ 'మాస్టర్' జనవరి 13న.. రామ్ 'రెడ్' జనవరి 14న.. బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' జనవరి 15న విడుదల అవుతున్నాయి. నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ని థియేటర్స్ కి లాక్కొచ్చేవి లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవితేజ - రామ్ - బెల్లకొండ శ్రీనివాస్ - తమిళ హీరో విజయ్ లకు కరోనా కారణంగానే సంక్రాంతి బెర్తులు దొరికాయని అంటున్నారు. అయితే వీరికి దొరికన ఈ ఎండమావి వంటి ఆఫర్ ని తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఎలా ఉపయోగించుకుంటారనేది చూడాలి.
ప్రస్తుతానికి మాస్ సెంటర్స్ లో జనాల్ని సంక్రాంతికి థియేటర్స్ కి రాబట్టేంత కెపాసిటీ ఉన్న సినిమాలు ఈసారి 'క్రాక్' లేదా 'అల్లుడు అదుర్స్' మాత్రమే అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక విజయ్ నుంచి వస్తున్న 'మాస్టర్' సినిమా డబ్బింగ్ కోటలోకే వెళ్లిపోతుంది. తెలుగు సినిమాల్ని చూడటానికే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారో రారో అనే డౌట్ ఉన్న పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. రామ్ పోతినేని 'రెడ్' సినిమా తమిళ్ 'తడమ్' స్టోరీ లైన్ తో వస్తోంది. ఈ సినిమా ఏ-సెక్షన్ ఆడియెన్స్ కి నచ్చితే ఆ కేటగిరిని నుంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అయితే నిజానికి క్రౌడ్ పుల్లర్స్ గా పేరు గాంచిన స్టార్ హీరోల సినిమాలు ఈసారి సంక్రాంతికి విడుదల చేస్తే బాగుండేది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టేదని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఈసారి పెద్ద పండగకి వచ్చే సినిమాలు ఏ రేంజ్ లో వసూళ్ళు రాబడతాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.