Begin typing your search above and press return to search.

అరుదైన రికార్డ్‌ ముందు నిల్చిన 'డాక్టర్‌'

By:  Tupaki Desk   |   23 Oct 2021 12:30 PM GMT
అరుదైన రికార్డ్‌ ముందు నిల్చిన డాక్టర్‌
X
గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుండి బాలీవుడ్‌ సినిమాలు థియేటర్ రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఒకవేళ విడుదల అయినా పాతిక నుండి ముప్పై కోట్లు దక్కించుకుంటే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది. అలాంటిది సౌత్ సినిమాలు మాత్రం వందల కోట్ల వసూళ్లను రాబడుతూ ఉన్నాయి. సౌత్‌ సినిమా లు ఈమద్య వరుసగా భారీ విజయాలను దక్కించుకుంటూ పదుల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. కరోనా మొదటి వేవ్‌ తర్వాత ఉప్పెన సినిమా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుని రికార్డు దక్కించుకుంది. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తర్వాత తమిళ మూవీ డాక్టర్‌ వంద కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. వంద కోట్ల వసూళ్లను దక్కించుకోబోతున్న డాక్టర్ సినిమా సౌత్ లోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా అరుదైన రికార్డును నమోదు చేయబోతుంది.

సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన సినిమాల్లో వంద కోట్లకు చేరువ అయిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటూ దూసుకు పోతున్న డాక్టర్ సినిమాకు రెండవ వారంలో కూడా భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు సినిమాకు 80 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. మరో వీక్ లో ఇరవై కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకోవడం కష్టం ఏమీ కాదు. కనుక సెకండ్‌ వేవ్‌ తర్వాత వంద కోట్లు దక్కించుకోబోతున్న సినిమా గా డాక్టర్‌ అరుదైన రికార్డు ముంగిట నిల్చింది. బాలీవుడ్‌ సినిమాలు మెల్ల మెల్లగా విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఉత్తరాధిన ముఖ్యంగా మహారాష్ట్రలో థియేటర్లు పునః ప్రారంభం అవుతున్నాయి. కనుక హిందీ సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.

హిందీ సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నా.. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయినా కూడా ఇంకా కాస్త అనుమానం అయితే ఉంది. జనాలు హిందీ సినిమాలను థియేటర్లలో ఏ మేరకు ఆధరిస్తారు అనేది ఇండస్ట్రీ వర్గాల వారిని కంగారు పెడుతోంది. బాలీవుడ్‌ సినిమాల వంద కోట్ల హడావుడి కాక ముందే డాక్టర్ సినిమా వంద కోట్ల క్లబ్‌ లో చేరి సెకండ్‌ వేవ్‌ తర్వాత మొదటి వంద కోట్ల సినిమాగా డాక్టర్‌ సినిమా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడుతో పాటు విడుదల అయిన అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లను నమోదు చేసిన డాక్టర్ తెలుగు ప్రేక్షకుల అభిమానంను కూడా దక్కించుకున్నాడు.