Begin typing your search above and press return to search.

ఓటీటీలో 'డాక్ట‌ర్ స్ట్రేంజ్' రిలీజ్ డేట్ ఇదే

By:  Tupaki Desk   |   4 Jun 2022 4:29 AM GMT
ఓటీటీలో డాక్ట‌ర్ స్ట్రేంజ్ రిలీజ్ డేట్ ఇదే
X
`డాక్టర్ స్ట్రేంజ్- ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్` ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. అవెంజ‌ర్స్ - అవ‌తార్ రేంజు కాక‌పోయినా క‌రోనా త‌ర్వాత వ‌చ్చిన మూవీగా ఇది సాధించిన‌ వ‌సూళ్లు కూడా త‌క్కువేమీ కాదు. భారీ విజువ‌ల్స్ గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆక‌ట్టుకున్న ఈ మూవీ ఇప్ప‌టికి తెలుగు రాష్ట్రాల్లో మ‌ల్టీప్లెక్స్ ల్లో ఆడుతోంది. అయితే ఇంత‌లోనే ఓటీటీ రిలీజ్ గురించి అప్ డేట్ అందింది.

జూన్ 22 నుండి డిస్నీ+ హాట్‌స్టార్ లో ఈ మూవీ ప్రసారం కానుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ- ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుందని స్ట్రీమింగ్ సర్వీస్ తెలిపింది. ముంబై: బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ నటించిన ``డాక్టర్ స్ట్రేంజ్ -ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్`` డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 22 న గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ కొన‌సాగుతుంద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో స్ట్రీమింగ్ సర్వీస్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలోనూ విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. సామ్ రైమి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016 బ్లాక్ బ‌స్ట‌ర్ `డాక్టర్ స్ట్రేంజ్` కి సీక్వెల్. ఇది కంబర్ బాచ్ ను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో స్టీఫెన్ స్ట్రేంజ్ అకా డాక్టర్ స్ట్రేంజ్ గా పరిచయం చేసింది.

2021 హిట్ చిత్రం `స్పైడర్-మ్యాన్: నో వే హోమ్`లో స్టీఫెన్ చేసిన మల్టీవర్స్-ఫ్రాక్చరింగ్ స్పెల్ పరిణామాల కోసం ప్రయత్నించినప్పుడు ఈ చిత్రం `డాక్టర్ స్ట్రేంజ్` స్పెల్ ను అనుసరిస్తుంది. ఇది మల్టీవర్స్ లోని విలన్ లు సెంట్రల్ MCUలోకి ప్రవేశించడానికి కారణమ‌వుతుంది.

``డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్``లో ఎలిజబెత్ ఒల్సేన్- చివెటెల్ ఎజియోఫోర్- బెనెడిక్ట్ వాంగ్- క్సోచిట్ల్ గోమెజ్ - మైఖేల్ స్టూల్ బర్గ్- రాచెల్ మెక్ ఆడమ్స్ త‌దిత‌రులు ఈ చిత్రంలో నటించారు. ఈ భారీ మూవీ గత నెలలో థియేటర్లలో విడుదలైంది.

సౌత్ లో మ‌ల్టీవ‌ర్స్ ఫీవ‌ర్

చూస్తుండ‌గానే ఇండియ‌న్ సినిమా కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇక్క‌డా మ‌ల్టీవెర్స్ స్కీమ్ లు ర‌న్ అయ్యేందుక స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఓవైపు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు ఇప్ప‌టికే ఇదే ప్యాట్ర‌న్ ని అనుస‌రిస్తున్నాయి. ఇక‌పై భారీ సినిమాల‌ను యూనివ‌ర్శ్ లు మ‌ల్టీవ‌ర్శ్ లు అంటూ భారీ సీక్వెల్ త‌ర‌హాలో తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్ల‌ను ఫండింగ్ ని స‌మ‌కూర్చుకుంటున్నారు.

ఈ ధోర‌ణిని అర్థం చేసుకుని ఇప్పుడు రాజ‌మౌళి స‌హా ప‌లువురు స్టార్ డైరెక్ట‌ర్లు ఇదే దారిలో వెళ్లేందుకు ఆలోచిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు సీక్వెల్స్ తీసి ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ఎలానో రాజ‌మౌళి- శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుల‌కు తెలుసు. ఇప్పుడు ఉత్త‌రాది మార్కెట్ ని కొల్ల‌గొడుతున్నందున టాలీవుడ్ - బాలీవుడ్ స్టార్ల‌తో మ‌ల్టీవ‌ర్శ్ ల‌ను క్రియేట్ చేయ‌డం సులువుగా మార‌నుంది.