Begin typing your search above and press return to search.
మనసు కదిలించే మాటల రచయితకు డాక్టరేట్
By: Tupaki Desk | 18 Nov 2021 5:13 AM GMTశర్వానంద్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలోని డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో హీరో చెప్పే ప్రతి డైలాగ్ కూడా గుండెలకు తాకేవిధంగా.. మనసును కదిలించే విధంగా.. కళ్లు చెమర్చే విధంగా ఉంటాయి. హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటుల డైలాగ్స్ కూడా చాలా సింపుల్ గా చాలా పెద్ద అర్థంను కలిగి ఉంటుంది. మనసుకు హత్తుకునే డైలాగ్స్ ను రాయడంలో ఆయనది అందెవేసిన చేయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే టాలీవుడ్ జక్కన్న తన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఆయన్ను ప్రత్యేకంగా తీసుకుని డైలాగ్స్ రాయించాడు. ఆయన నుండి వచ్చిన ప్రతి డైలాగ్ ప్రేక్షకుల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయనే రచయిత సాయి మాధవ్ బుర్రా. ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరి సమయం నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా టైమ్ నడుస్తుంది.
సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవకు గాను ప్రముఖ కాలిఫోర్నియా లోని న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ వారు సాయి మాధవ్ బుర్రా కు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇటీవలే సదరు యూనివర్శిటీ వారు సాయి మాధవ్ బుర్రాకు ఈ డాక్టరేట్ ను ప్రకటించారు. తాజాగా రవీంద్ర భారతిలో సినీ ప్రముఖులు మరియు భాష ప్రముఖుల సమక్షంలో యూనివర్శిటీ వారు సాయి మాధవ్ బుర్రాకు డాక్టరేట్ ను బహూకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు దక్కిన ఈ డాక్టరేట్ ను తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. సినీ ప్రముఖులు ఈ సందర్బంగా సాయి మాధవ్ బుర్రాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నాటకాలకు మాటలు రాస్తూ కెరీర్ ను సాగిస్తున్న సాయి మాధవ్ బుర్రాను దర్శకుడు క్రిష్ ప్రోత్సహించాడు. ఆయన ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి మాధవ్ బుర్రా ఎన్నో సినిమాలకు వర్క్ చేశాడు. సాయి మాధవ్ సినీ కెరీర్ లో నిలిచి పోయే సినిమాలు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. కృష్ణంవందే జగద్గురుం.. గౌతమి పుత్ర శాతకర్ణి.. సైరా.. మహానటి. ఇంకా ఆయన కలం నుండి ఎన్నో సినిమాలకు డైలాగ్స్ వచ్చాయి. ఈయన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా విడుదల తర్వాత ఖచ్చితంగా సాయి మాధవ్ బుర్రా మరింత పాపులర్ అవ్వడం ఖాయం అంటున్నారు.