Begin typing your search above and press return to search.
బిగ్ బి ఫ్యామిలీకిి కరోనా ప్రమాదం లేదు: వైద్యులు వెల్లడి
By: Tupaki Desk | 13 July 2020 4:30 PM GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఎంతో అభిమానించే అమితాబ్.. ఐశ్వర్య.. అభిషేక్.. వాళ్ల కూతురు ఆధ్య ఉన్నారు. వీరంతా కరోనా పేషెంట్స్ అనగానే అభిమానులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేక పోయారు. వెంటనే తమ అభిమాన తారలకు ఏమి కాకూడదని అభిమానులు ఇష్టదైవాలను ప్రార్థించడం మొదలుపెట్టారు. నిజానికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగానే వీరి నలుగురికి పాజిటివ్ వచ్చి.. మిగతా జయా బచ్చన్, శ్వేత ఆమె పిల్లలకు నెగటివ్ వచ్చింది. ఇక అమితాబ్ అభిషేక్ వెంటనే దగ్గరలోని నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అమితాబ్, అభిషేక్ లకు ఎలాంటి ప్రమాదం లేదని ఓ తీపికబురు చెప్పింది. ఈ వార్త తెలిసి అభిమానులలో కోలాహలం మొదలైంది.
అసలు ఏం జరిగింది అనే సంగతి పై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అమితాబ్ అభిషేక్ లకు పూర్తి కరోనా వైద్యం అవసరం లేదని తెలిపింది. ఎందుకంటే కరోనా ఏం ప్రమాదకర స్థాయిలో లేదట. తక్కువ డోస్ మందులతో కేవలం అబ్సర్వేషన్ సరిపోతుందని చెప్పారు. అంతేగాక వీరికి ఒక వారంలో మళ్లీ కరోనా టెస్ట్ చేస్తామని అప్పటి రిజల్ట్స్ బట్టి వైద్యంలో మార్పులు చేస్తామని.. పాజిటివ్ ఉంటే డోస్ పెంచుతాం. లేదంటే ఇలాగే మరో వారం అబ్జర్వేషన్ లో ఉంచుతామని అన్నారు. ఇక ఐశ్వర్యరాయ్, ఆధ్య లకు అసలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదన్నారు. కేవలం వారు ఇంటివద్దే జాగ్రతలు తీసుకుంటూ మందులు వేసుకుంటే సరిపోతుంది అన్నారు. ప్రస్తుతం అభిమాన విశ్వసుందరి.. ఆమె కూతురు ఇంటిలోనే వైద్యం పొందుతున్నారు. అభిమానులు గమనించాల్సింది ఏంటంటే.. తమ అభిమాన తారలకు ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నాయి సినీ వర్గాలు.