Begin typing your search above and press return to search.

తన సినిమాలు ఆడకేనా ఈ ఏడుపు?

By:  Tupaki Desk   |   17 July 2015 11:30 AM GMT
తన సినిమాలు ఆడకేనా ఈ ఏడుపు?
X
అనగనగా ఒక నక్క. అది ఊరంతా తిరిగింది. ఊరి చివర ద్రాక్షతోటలన్నీ కలియ తిరిగింది. అక్కడక్కడ కిందికి వంగి ఉన్న ద్రాక్ష గుత్తుల్ని అందుకోవాలని ఎంతో ఆరాటపడింది. ఎగిరెగిరి ప్రయత్నించింది. కానీ ఆ ద్రాక్ష గుత్తు అందదే. ప్రయత్నించి ప్రయత్నించి చివరికి విసిరిగి వేశారిపోయింది. చివరికి 'ఛీ ఈ ద్రాక్ష పళ్లు పుల్లన' అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిలోని నీతి ఏమి? మీ అందరికీ తెలిసిందే. అందని ద్రాక్ష పుల్లన అన్న సామెతను చిన్నప్పుడే మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం.

ఇప్పుడు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వ్యవహారం కూడా ఇలానే ఉంది. ఇతగాడు ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అవి వస్తున్నాయి. వెళుతున్నాయి. తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అన్నీ అట్టర్‌ ఫ్లాప్‌లే. దాంతో పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయిన ఇతగాడు ప్రస్తుతం డాక్యుమెంటరీలు తీసుకుంటూ టైమ్‌ పాస్‌ చేస్తున్నాడు. అంతేనా అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా అసలు ఛీఛీ ఈ ఫీచర్‌ ఫిలింస్‌ వేస్ట్‌. వాటి కంటే డాక్యుమెంటరీలే బెటర్‌. బావుంటున్నాయి అంటూ సెలవిస్తున్నాడు. కశ్యప్‌ దివంగత పాప్‌ గాయని అమీ వైన్‌హౌస్‌ పై తెరకెక్కించిన డాక్యుమెంటరీ 'అమీ' ఇటీవలే లాంచ్‌ అయ్యింది. అంతకంటే ముందే వివాదాస్పద నట రాధికా ఆప్టేతో ఓ న్యూడ్‌ లఘుచిత్రం కూడా తీసి ఇలానే చెప్పుకొచ్చాడు. పాపం సక్సెస్‌ లేక ఇలా అయిపోయాడు చివరికి. అదీ సంగతి