Begin typing your search above and press return to search.
రెహమాన్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్
By: Tupaki Desk | 11 April 2015 1:30 AM GMTఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతంలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. దక్షిణాదిన ప్రస్థానం మొదలుపెట్టిన ఈ సంగీత దర్శకుడు ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం అపూర్వం. ఓ భారతీయుడికి ఆస్కార్ అవార్డు దక్కడం ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న సమయానికి ఒకటికి రెండు ఆస్కార్ అవార్డులు సాధించి దేశం గర్వించేలా చేశాడు రెహమాన్. ఈ సంగీత జ్ఞాని సినీ స్వర ప్రస్థానంపై 'జయహో' పేరుతో అద్భుతమైన డాక్యు డ్రామా తయారైంది. గంటన్నర నిడివి కలిగిన ఈ డాక్యుడ్రామా రెహమాన్ అభిమానులకు ఓ మధుర జ్ఞాపకమే.
ఉమేష్ అగర్వాల్ అనే దర్శకుడు జయహో డాక్యు డ్రామాను రూపొందించాడు. ఇందులో రెహమాన్ ఎలా అంచెలంచెలుగా ఎదిగాడు.. ప్రపంచ స్థాయికి ఎదిగి ఆస్కార్ అవార్డులు ఎలా సాధించాడు.. అన్నది వివరించారు. ఎందరో సినీ ప్రముఖులు రెహమాన్ గురించి ఇందులో మాట్లాడారు. రెహమాన్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా వాయిస్ ఇచ్చారు. తన తండ్రి మరణం గురించి.. ఇస్లాం మతం స్వీకరించడం, పెళ్లి చేసుకోవడంతో పాటు అనేక వ్యక్తిగత విషయాల్ని కూడా రెహమాన్ పంచుకున్నాడు. శేఖర్ కపూర్ లాంటి ప్రముఖులు రెహమాన్ గురించి చెప్పిన మాటలు ఈ డాక్యుడ్రామాకు హైలైట్. రెహమాన్ అభిమానులందరి దగ్గరా తప్ప ఉండాల్సిన ఈ డాక్యుడ్రామా మార్కెట్లోకి వచ్చేసింది.