Begin typing your search above and press return to search.
అక్షయ్ మాటల్లో డబుల్ మీనింగ్ ఉందా ?
By: Tupaki Desk | 19 July 2019 2:30 PM GMTవిలక్షణమైన సినిమాలను ఎంచుకోవడంలో తన రూటే సెపరేటు అని నిరూపించే అక్షయ్ కుమార్ కొత్త సినిమా మిషన్ మంగళ్ ట్రైలర్ తోనే అంచనాలు రెట్టింపు చేసుకుంది. ఇండియన్ స్పేస్ హిస్టరీలో గొప్ప ఘనతగా భావించే మంగళ్యాన్ ప్రయోగం ఆధారంగా రూపొందిన మూవీలో అందరూ లేడీ స్టార్స్ నటించడం విశేషం. దీనికి సంబంధించి నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో అక్షయ్ కుమార్ చేసిన కొన్ని కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి.
మిషన్ మంగళ్యాన్ ప్రయోగించడానికి అయిన ఖర్చు 450 కోట్లని కానీ తాను విలన్ గా చేసిన 2.0 తీయడానికి నిర్మాతలు 500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారని ఒక సినిమాకు అయిన ఖర్చు కంటే అంతరిక్ష ప్రయోగానికి తక్కువ వ్యయం అయ్యిందన్న అక్షయ్ కామెంట్స్ లో ఉద్దేశం ఏదున్నా మీనింగ్ మాత్రం ఇంకోలా వెళ్ళిపోయింది. దర్శకుడు శంకర్ ని ఉద్దేశించే ఈ మాటలు అన్నట్టుగా మీడియాలో టాక్ వచ్చేసింది.
భారతీయ చలన చిత్ర చరిత్రలో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆశించిన 2.0 మాములు ఫలితం అందుకుని సోసో గా పాసవడం ఎవరూ మర్చిపోలేదు. అంత బడ్జెట్ పెట్టారని చెప్పుకుని ఫస్ట్ హాఫ్ లో ఒక ఛేజ్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ తప్ప ఇంకెక్కడ వ్యయం చేశారు అని రిలీజైన వెంటనే కామెంట్స్ వచ్చాయి. రోబోకు వచ్చినంత రెస్పాన్స్ తెచ్చుకోవడంలో 2.0 ఫెయిల్ అయ్యింది.
తన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతుందనుకున్న అక్షయ్ కుమార్ చివరికి షాకింగ్ రిజల్ట్ చవి చూశాడు. అది మనసులో ఉంది కాబట్టే ఇలా 2.0 బడ్జెట్ ప్రస్తావన అక్షయ్ కుమార్ తెచ్చాడని ఈవెంట్ లోనే గుసగుసలు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే 2.0 కంటే మంచి విజువల్ ఎఫెక్ట్స్ చక్కని ఎమోషన్స్ మిషన్ మంగళ్ లోనే కనిపిస్తున్నాయని అక్కడే ఓపెన్ కామెంట్స్ వినిపించడం కొసమెరుపు