Begin typing your search above and press return to search.
బ్రహ్మాస్త్రకు బాహుబలి రేంజు సీనుందా?
By: Tupaki Desk | 15 Dec 2021 9:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి. పుష్ప తర్వాత సంక్రాంతి బరిలో మూడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. వీటన్నిటిలో బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేసే సినిమా ఏదీ? అన్న ఉత్కంఠ నెలకొంది.
బాహుబలి స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ తో పాటు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ .. పవన్ కల్యాణ్ - రానాల భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటిలో ఏ చిత్రం బాహుబలి రికార్డుల్ని కొడుతుంది? అన్నది సస్పెన్స్.
మరోవైపు బాలీవుడ్ నుంచి బ్రహ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నాలుగైదేళ్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ -అమితాబ్ - నాగార్జున లాంటి ప్రముఖ స్టార్లు నటించారు. ఆలియాభట్ ఇందులో కథానాయిక. ఇంతటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ఎందుకనో అంతకంతకు ఆలస్యమైంది. ఆయాన్ ముఖర్జీ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నా ఏదీ పూర్తి కావడం లేదు. 2022లో ఈ మూవీ విడుదలవుతుంది. కానీ రిలీజ్ తేదీపై స్పష్ఠత లేదు. ప్రస్తుతానికి మోషన్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు. మోషన్ పోస్టర్ కు ముందు బిగ్ బి బ్రహ్మాస్త్ర గ్లింప్స్ ని విడుదల చేశారు. 15 డిసెంబర్ (నేడు) న్యూ ఢిల్లీలో జరిగే ప్రత్యేక అభిమానుల కార్యక్రమంలో మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడానికి బ్రహ్మాస్త్ర టీమ్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
బ్రహ్మాస్త్ర నిస్సందేహంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ చిత్రాలలో ఒకటి. ప్రేక్షకులు ఈ భారీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా గ్లింప్స్ లో ఏం ఉందో పరిశీలిస్తే ఈ చిత్రంలో శివగా నటిస్తున్న రణబీర్ కపూర్ ప్రత్యేక శక్తితో ఒళ్లంతా నిప్పుతో భగభగ మండుతూ కనిపిస్తున్నాడు. అతడి శరీరం గొప్ప విద్యుత్ శక్తితో మెరుస్తోంది. చేతులు చాచి అతడు ఎనర్జీని సంగ్రహిస్తున్న పోస్టర్ ఉత్కంఠను పెంచింది. ఇది సూపర్ హీరో తరహా చిత్రమని అర్థమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక యాక్షన్-అడ్వెంచర్ మూవీని 2022లో తెలుగు- తమిళం- కన్నడ- మలయాళంలో విడుదల చేయనున్నారు. అయితే ఇన్నేళ్లలో బిగ్ బి కానీ రణబీర్ కానీ బాహుబలి రేంజు సినిమాని చేయలేకపోయారు. బాలీవుడ్ సహా ఇతర పరిశ్రమల్లోనూ ప్రయత్నించినా అంత ఈజీగా పనవ్వలేదు. బ్రహ్మాస్త్రను కూడా అన్ని భాషల్లో విడుదల చేసి బాహుబలి రేంజు హిట్టు కొట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది. కానీ అది ఎంతవరకూ సఫలమవుతుంది? అన్నది వేచి చూడాలి.