Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప‌రువు నిల‌బెట్టుకుందా? పోగొట్టుకుందా?

By:  Tupaki Desk   |   11 Feb 2022 4:41 AM GMT
టాలీవుడ్ ప‌రువు నిల‌బెట్టుకుందా?  పోగొట్టుకుందా?
X
ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఏ ప్ర‌భుత్వ‌మైనా...సానుకూలంగా ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. చ‌ర్చ‌ల ద్వారానో.. మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారానో ఆయా స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తుంది. అయితే.. ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఏ స‌మ‌స్య‌నైనా కూడా త‌న ప‌ట్టుద‌ల‌నే నిరూపించుకుంది. ఎదుటి ప‌క్షాన్ని పాదా క్రాంతం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. గ‌తంలో వ‌చ్చిన అనేక స‌మ‌స్య‌లు ఇలానే సానుకూలం అయ్యాయి. త‌న మాట‌నే స‌ర్కారునెగ్గించుకుంటూ వ‌చ్చింది.

ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయి.. స‌ర్కారుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తామ‌ని భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు చేసిన ఉద్యోగ సంఘా ల‌ను కూడా దారికి తెచ్చుకుంది. అంతేకాదు.. స‌ర్కారు చెప్పిన వాటికే.. సంఘాలు త‌లాడించే ప‌రిస్థితిని తెచ్చుకుంది. ఇక‌, ఓటీఎస్ వంటివాటిపై ఎన్ని వ్య‌తిరేక‌త‌లు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల నుంచి ఎన‌న్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప్ర‌భుత్వం పంతం నెగ్గించుకుంటోంది. ఇక‌, రాజ‌ధాని విష‌యం ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఏతా వాతా ఎలా చూస్తున్నా..స‌ర్కారు పంత‌మే పైచేయిగా ఉంది.

ఇక‌, ఇప్పుడు టాలీవుడ్‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల విష‌యంలోనూ.. ప్ర‌భుత్వంత‌న పంత‌మే నెగ్గించు కుంది. త‌ను చెప్పిందే అమ‌లు చేయాల‌ని తీర్మానం చేసుకుంది. ఒక‌టి రెండు చిన్న‌విష‌యాలు త‌ప్ప‌! అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో టాలీవుడ్‌ను తన ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించుకోవ‌డంలోను.. అతిర‌థులుగా పేరున్న నటుల‌ను హ‌డావుడిగా.. తాడేప‌ల్లి మార్గం ప‌ట్టించ‌డంలోనూ.. ప్ర‌భుత్వం విజ‌యం సాధించింది.

అంతేకాదు.. ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌డితే..ఎలాంటి వారైనా అంజ‌లి ఘ‌టించాల్సిందే.. అనేసందేశం ఈ స‌మాజానికి పంపేసింది. దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ‌.. చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లే. ``అమ్మ‌లాగా పెద్ద‌మ‌న‌సు చేసుకుంటార‌ని.. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం`` అంటూ..చిరంజీవి సీఎం జ‌గ‌న్‌ను వేడుకున్న వీడియో ఇప్ప‌డు సోష‌ల్‌మీడియాలో జోరుగా హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇది ఏదో అయాచితంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో కాదు. కావాల‌ని ప్ర‌భుత్వంపైనా..చిరంజీవిపైనా.. కుట్ర ప‌పూరితంగా ఎవ‌రో బ‌య‌ట పెట్టిన వీడియో అంత‌క‌న్న కాదు!

ఎందుకంటే.. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌న‌, చీమైనా అనుమ‌తి ఉంటే త‌ప్ప‌.. లోప‌ల‌కు వెళ్ల‌ని సీఎం చాంబ‌ర్‌లో జ‌రిగిన చ‌ర్చ‌ల విష‌యాల‌ను ప్ర‌భుత్వ‌మే మీడియాకు విడుద‌ల చేస్తోంది. దీనిని బ‌య‌ట‌కు విడుద‌ల చేసే స‌మ‌యంలో ప్ర‌భుత్వంలోని కీల‌క పెద్ద‌లు, స‌ల‌హాదారు..కూడా వీక్షించి.. ప్ర‌భుత్వం వైపు త‌ప్పులు ఉంటే.. అక్క‌డే ఎడిట్ చేసి మ‌రీ .. బ‌య‌ట‌కు పంపుతున్నారు.

అలాంటి వీడియోలో చిరంజీవి చేసిన ``చేతులు జోడించి`` అనే మాట‌ను బ‌య‌ట‌కు పంపారంటే. స‌ర్కారు ఉద్దేశం ఏంటో.. అర్ధం కావ‌డం లేదా? అంటున్నారు మేధావులు. ఎవ‌రైనా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి త‌ల వొంచాల్సిందే! అనే సంకేతాలు పంప‌డం లేదా? అని విమ‌ర్శిస్తున్నారు. ఏదేమైనా..జ‌గ‌న్ వేసిన ఉచ్చులో టాలీవుడ్ ప‌రువు నిల‌బెట్టుకుందా? పోగొట్టుకుందా? అనేది తేల్చుకోవాల‌ని అంటున్నారు.