Begin typing your search above and press return to search.
స్టార్లతో సినిమాల వల్ల అంత ఖర్మ పట్టిందా?
By: Tupaki Desk | 10 Dec 2019 7:15 AM GMTస్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అనేది ఒక జూదం లాంటిదని చాలరోజుల నుండి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే కొత్త టాక్ ఏంటంటే జూదంలో కనీసం ఎప్పుడో ఒకసారి అయినా డబ్బు వస్తుందని.. లక్కు మన పక్కనంటే జాక్ పాట్ కూడా తగులుతుందని.. స్టార్ హీరోలతో సినిమా చేస్తే చేతికి చిప్ప మాత్రమే వస్తుందని అంటున్నారు. స్టార్ హీరోలతో సినిమా చేయడం జూదం కంటే హీనంగా మారిందని అంటున్నారు.
సుత్తి లేకుండా సూటిగా విషయం చెప్పుకుంటే ఇద్దరు బడా స్టార్ల సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. సినిమాల బడ్జెట్ అదుపులేకుండా పెరిగిపోయిందని.. ఇందులో ప్రమోషన్స్ ఖర్చుకూడా హద్దులు దాటుతోందని గుసగుసలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు మొదలు పెట్టిన సమయంలో ఓవర్సీస్ మార్కెట్.. శాటిలైట్ మార్కెట్.. హిందీ డబ్బింగ్ మార్కెట్ భారీగా ఉండడంతో సినిమాకు రికవరీ ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ టోకున దెబ్బ తినడంతో ఎక్కువగా థియేట్రికల్ రైట్స్ పైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలకు డబ్బు విషయంలో కటకటగా ఉందట. ఇద్దరూ నిర్మాతలకు రూ. 50 కోట్లు ఆవసరమని.. ఆ డబ్బు కోసం ఫైనాన్షియర్లకై వెతుకుతున్నారని సమాచారం. ఎన్నారై సర్కిల్స్ నుంచి అప్పుతీసుకుంటే ఇబ్బందులు ఉండవని అలా ప్లాన్ చేస్తున్నారు. డబ్బు ఎలాగూ తిరిగి ఇవ్వాల్సిందే కానీ ఈ డబ్బు సర్దుబాటు చేసినందుకు ఒక నిర్మాత తన హీరో నెక్స్ట్ సినిమా డేట్స్ ఇప్పిస్తానని హామీ ఇస్తుంటే.. మరో నిర్మాత తన దర్శకుడి డేట్స్ ఇప్పిస్తానని అంటున్నారట.
ఈ విషయాలు బైటకి రావడంతో ఈ నిర్మాతలకు ఎంత ఖర్మ పట్టిందిరా.. అని కామెంట్లు వినబడుతున్నాయి. అక్కడ ఫ్యాన్స్ ఏమో మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప అని కొట్టుకు చస్తుంటారు ఇక్కడ ఆ 'గొప్ప' హీరోల సినిమాల వల్ల బడా నిర్మాతలే ఇబ్బందుల్లో పడుతున్నారు.