Begin typing your search above and press return to search.
ముద్దు సీన్స్ కు భర్త అనుమతి ఉందా అంటే ఆమె రియాక్షన్..!
By: Tupaki Desk | 9 Feb 2022 6:56 AM GMTసిద్దాంత్ చతుర్వేది.. దీపిక పదుకునే.. అనన్య పాండే ఇంకా ప్రముఖ నటీ నటులు నటించిన గెహ్రైయాన్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 11న అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో దీపిక పదుకునే మరియు సిద్దాంత్ ల మద్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మరో లెవల్ లో ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
పెళ్లి అయిన ఒక హీరోయిన్ మరీ ఇంతలా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే.. దీపిక పదుకునే అభిమానులు మాత్రం రొమాన్స్ ను ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు. వారు సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దీపిక పదుకునే మరియు సిద్దాంత్ చతుర్వేదిలు మీడియా తో ముచ్చటించారు.
సిద్దాంత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన దీపిక పదుకునే తో నటించాలి అనగానే మొదట నర్వస్ ఫీల్ అయ్యాను. ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు అంటే నా వల్ల అయ్యేనా అనే ఆలోచన వచ్చింది. కాని షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాలు చేశామన్నాడు.
ఇక ఈ సన్నివేశాల విషయమై మీరు మీ భర్త అయిన రణ్వీర్ సింగ్ ను అడిగారా.. అతడి నుండి ముద్దు సన్నివేశాలకు పర్మీషన్ తీసుకున్నారా అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు దీపిక పదుకునే సీరియస్ అయ్యింది. ఆ కామెంట్ చేసిన వ్యక్తి తీరుపై.. అతడి మానసిక పరిస్థితిపై కూడా దీపిక పదుకునే అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమాధానం వ్యక్తం చేసింది.
ఇలాంటి ఒక విషయానికి నేను స్పందించడం మూర్ఖత్వం అవుతుంది. నా జీవితంలో నటన ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు అలాగే నా జీవిత భాగస్వామికి కూడా ఆ విషయం ముందే తెలుసు. నేను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను అస్సలు చదవను. నా యొక్క సినిమాల విషయాలను గురించి రణ్వీర్ తో చర్చిస్తానా లేదా అనేది మా వ్యక్తిగత విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు చాలా తెలివి తక్కువ వారు అనిపిస్తుంది. అదే సమయంలో వారు చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుందని దీపిక సమాధానం చెప్పింది.
హీరోగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న సినిమాల్లో ఆయన హీరోయిన్స్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం ఎంత సహజమో.. దీపిక హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఇతర హీరోలతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కూడా అంతే సహజం. కనుక ఈ విషయంలో వారిద్దరి మద్య ఒప్పందాలు.. పర్మీషన్ లు ఉండక పోవచ్చు అనేది నెటిజన్స్ అభిప్రాయం. కనుక ఈవిషయంలో దీపిక ను పదే పదే ప్రశ్నించి ఆమె ఆగ్రహంకు గురి అవ్వక పోవడం మంచిది.