Begin typing your search above and press return to search.
బాహుబలి వచ్చి వాటి విలువ పెంచాడు
By: Tupaki Desk | 20 Jun 2017 4:22 PM GMTఇండియాలోనే అతిపెద్ద మోషన్ పిక్చర్ బాహుబలి బాక్స్ ఆఫీసు కలెక్షన్లు లోనే కాదు ఇంకా చాలా ఇండస్ట్రీస్ లో మార్పులు తీసుకువచ్చింది. బాహుబలి సినిమా విజయంతో ఇండియాలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టతను ప్రపంచానికి చెప్పడంతో పాటుగా మన ఇండియాలో యానిమేషన్ గ్రాఫిక్స్ ఇండస్ట్రి ని మరో మెట్టు ఎక్కించాడు రాజమౌళి.
బాహుబలి2 లో సుమారుగా 4500 VFX షార్ట్స్ ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు సినిమాలో గ్రాఫిక్స్ ఏ స్థాయిలో వినియోగించారో. షారూక్ ఖాన్ రా.వన్ - హృతిక్ రోషన్ క్రిష్ 3 - మొహెంజొదారో - కమల్ హాసన్ విశ్వరూపం వంటి సినిమాలలో వాడిన విఎఫ్ ఎక్స్ అంతా కలుపుకున్నా కూడా.. బాహుబలి సినిమా గ్రాఫిక్స్ ఇండస్ట్రి పై ఎక్కువ ప్రభావం చూపిందని సర్వేలు చెబుతున్నాయి. గత ఏడాది విఎఫ్ ఎక్స్ ఇండస్ట్రి ఆదాయం 59.5 బిలియన్ రూపాయలు కాగా ఆ ముందు ఏడుతో పోల్చుచూస్తే 16.4 % పెరిగినట్లు తెలుస్తోంది.
నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా - మేక్ ఇన్ ఇండియా ప్రభావంతో ఇప్పుడు డిజిటల్ ఇండస్ట్రి మరింత పుంజుకుంది. దానికి తోడుగా బాహుబలి లాంటి సినిమాలు ఇచ్చిన బలంతో మరిన్ని సినిమాలు గ్రాఫిక్స్ తో నిర్మించడానికి ముందుకువస్తున్నారు. ఇలానే సొనసాగితే 2020 కి 87.1 బిలియన్ రూపాయల మార్కు చేరుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే 40 విఎఫ్ ఎక్స్ స్టూడియోస్ 85 గేమ్ డెవలప్మెంట్ స్టూడియోస్ ఉన్న మన దేశంలో ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ సృష్టించే సత్తా వచ్చేసింది. ఇక కాస్కోండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/