Begin typing your search above and press return to search.
'పుష్ప -2' లో మొండేలు ట్విస్ట్ ఇస్తాడా?
By: Tupaki Desk | 22 Jan 2022 10:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని తాను పాన్ ఇండియా స్టార్ గా మార్చుకున్న మూవీ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు ఉత్తరాది బాక్సాఫీస్ ని దుమ్ముదులిపేస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పోలిస్తే ఈ మూవీ హిందీ వెర్షన్ ఉత్తరాదిలో వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. ఎలాంటి ప్రచారం చేయకపోయినా బన్నీ క్రేజ్ తో ఈ మూవీ ఏకంగా 85 కోట్ల మార్కుని దాటి ట్రేడ్ పండితులతో పాటు మేకర్స్ ని కూడా విస్మయానికి గురిచేసింది.
దీంతో ఈ మూవీ పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. `పుష్ప` కు లభించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ `పుష్ప -2` లో భారీ మార్పులు చేస్తున్నారట. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక ఘట్టాల్లో మార్పులు చేసి పాన్ ఇండియా రేంజ్ లో వుండేలా ప్లాన్ చేస్తున్నారట. అంతా ఓకే అయితే పిబ్రవరి నుంచి `పుష్ప -2` ని ప్రారంభించాలని ఇప్పటికే మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, హీరో బన్నీ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక పార్ట్ 1 ని పుష్ప - శ్రీవల్లి పెళ్లి సీన్ తో ఎండ్ చేసిన సుకుమార్ పార్ట్ 2ని ఎస్పీ భన్వర్ సింగ్ షెకవాత్ (ఫహద్ ఫాజిల్) - పుష్పల మధ్య సాగే ఈగో వార్ గా చూపించబోతున్నాడట. అంతే కాకుండా పార్ట్ 2 కోసం కొంత మంది హిందీ స్టార్ లని కూడా రంగంలోకి దింపబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చేసింది.
పార్ట్ 1 ని బన్నీ పక్కన అసిస్టెంట్ గా కేశవ.. ఉరాఫ్ మొండేలు పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి చేత ప్రారంభించాడు సుకుమార్. టైటిల్స్ దగ్గరి నుంచి పుష్ప కథని నరేట్ చేస్తూ ప్రేక్షకుల్ని కథలోకి తీపుకెళతాడు. ఎబ్ సిరీస్ లలో చిన్న చిన్న పాత్రలు వేసుకునే చిన్ననటుడు జగదీష్ కు అప్పగించడం ఏంటని అంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఎవరీ నటుడు ఎక్కడా చూడలేదే.. తమిళ్ నుంచి తీసుకొచ్చారా? అని ఆరాలు కూడా తీశారు. అయితే ఇతను తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు చెందిన వ్యక్తి.
`పుష్ప -2` లోనూ మొండేలు కేశవకు సుకుమార్ ప్రాధాన్యతనిచ్చినట్టుగా తెలుస్తోంది. రెండవ భాగంలోనూ కేశవ పాత్రకు ప్రాధాన్యత వుంటుందని, అతని పాత్రతో `పుష్ప`కు గట్టి షాక్ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్ట్ 2 లో పుష్ప సిండికేట్ రారాజుగా రూల్ చేయడం.. దానికి ఎస్పీ భన్వర్ సింగ్ షెకవాత్ (ఫహద్ ఫాజిల్) అడ్డుతగడం అన్నది కథ.
కానీ ఈ కథలో మొండేలు కేశవ ట్విస్ట్ ఇస్తాడట. నమ్మిన పుష్ప కే వెన్నుపోటు పొడిచి కథని కీలక మలుపు తిప్పుతాడని ప్రచారం జరుగుతోంది. నిజంగా ఇది బన్నీ ఫ్యాన్స్ కి అదిరిసోయే ట్విస్టే అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే `పుష్ప -2` విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.