Begin typing your search above and press return to search.
ఆ పాత్రకు లవర్ బాయ్ సెట్ అవుతాడా?
By: Tupaki Desk | 11 Nov 2019 1:45 PM GMTఈమధ్య టాలీవుడ్ మేకర్స్ రీమేక్ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రస్తుతం రెండు మూడు రీమేక్ లు ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. వాటిలో తమిళ హిట్ 'అసురన్' రీమేక్ గురించి సురేష్ ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా కాకుండా సురేష్ బాబు 'డ్రీమ్ గర్ల్'.. 'సోను కే టిటూ కి స్వీటీ' సినిమాలను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది.
'సోను కే టిటూ కి స్వీటీ' సినిమాను విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిస్తారని అంటున్నారు. 'డ్రీమ్ గర్ల్' విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ హిందీ సినిమాలో హీరో పాత్ర అమ్మాయి లక్షణాలతో ఉంటుంది. కథలో సగభాగం హీరో అమ్మాయి గొంతుతో మాట్లాడాలి. దీంతో ఈ కథకు సరిపోయే హీరోను వెతకడం కష్టంగా మారింది. రీసెంట్ గా ఈ పాత్రకు రాజ్ తరుణ్ ఓకే చెప్పాడట. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర చేస్తే నటుడిగా మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో 'డ్రీమ్ గర్ల్' రీమేక్ లో నటించేందుకు రెడీ అయ్యాడట. ఈ సినిమాకు 'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారట.
దర్శకుడు ఒకే కానీ ఆయుష్మాన్ పాత్రలో రాజ్ తరుణ్ నటించే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ఆ పాత్రకు సూట్ అవుతాడా?.. ఆయుష్మాన్ యాక్టింగ్ ను మ్యాచ్ చెయ్యగలడా? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఇప్పటివరకూ చేసినవన్నీ దాదాపుగా లవర్ బాయ్ పాత్రలే.. ఒకవేళ ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఇంత ఛాలెంజింగ్ పాత్రలో నటించడం మొదటిసారి అవుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.