Begin typing your search above and press return to search.

హైదరాబాద్లో పెరిగిన మిథాలిరాజ్ తెలుగు మాట్లాడుతారా..?

By:  Tupaki Desk   |   14 July 2022 8:30 AM GMT
హైదరాబాద్లో పెరిగిన మిథాలిరాజ్ తెలుగు మాట్లాడుతారా..?
X
భారత మహిళల క్రికెట్ మొదటి కెప్టెన్ ఎవరంటే మిథాలి రాజ్ అని చెబుతారు. వుమెన్ క్రికెట్ హిస్టరీలో రికార్డు రాసిన ఆమె కొన్ని రోజుల కిందట రిటర్మైంట్ ప్రకటించారు. యవతకు అవకాశం ఇచ్చేందుకే తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఆమె క్రికెట్ కెరీర్ ముగిసినా ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఆమె లైఫోస్టోరీని సినిమాగా తీశారు. 'శభాష్ మిథాలి' పేరుతో హిందీలో ఈ సినిమాను చిత్రీకరించారు. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో మిథాలీ రాజ్ కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఆమె హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎప్పుడూ హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడే మిథాలి ఇప్పుడు తెలుగులో మాట్లాడారు. దీంతో ఆమె మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.

రాజస్థానీ కుటుంబానికి చెందిన మిథాలీరాజ్ హైదరాబాద్లోనే పుట్టారు. చిన్నతనం నుంచి యాక్టివ్ గా ఉన్న ఆమె క్రికెట్ రంగంలో రాణించారు. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు చేశారు. ఆ తరువాత 2001-02లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ పై ఆడారు. ఇంగ్లండ్ పై టాంటన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే రికార్డు సృష్టించారు.

2005లో మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత జట్టుకు నేతృత్వం వహించారు. 2022లో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో పాల్గొని అత్యదిక వన్డే ప్రపంచ కప్ లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా పేరొందారు. మొత్తం తన కెరీర్లో 232 వన్డేలు, 12 టెస్టులు ఆడారు. వన్డేల్లో 7805 పరుగులు, టెస్టుల్లో 690 పరుగలు చేశారు.

2022 జూన్ 8న అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీరాజ్ తెలిపారు. అయితే ఆమె జీవిత చరిత్రపై 'శభాష్ మిథు' పేరుతో హిందీలో వస్తోంది. ఇందులో మిథాలీరాజ్ పాత్రలో తాప్సీ నటిస్తోంది. శుక్రవారం సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ సినిమాను ప్రమోషన్ చేస్తున్నారు. తాప్సీతో పాటు మిథాలీరాజ్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

'నేను 23 ఏళ్లుగా దేశ క్రికెట్ తరుపున ఆడుతున్నాను. యువరక్తం జట్టులోకి రావాలనే ఉద్దేశంతోనే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా.. ప్రపంచ కప్ కు సిద్ధమయ్యేలా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను' అని తెలుగులో చెప్పారు.

అయితే మిథాలీ ఇప్పటి వరకు ఏ విషయాన్నైనా హిందీ, ఇంగ్లీష్ లోనే చెప్పారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగినా ఆమెకు తెలుగు తెలుసు. కానీ అంతర్జాతీయ వేదికలపైనే ఎక్కువగా కనిపించినందున తెలుగు మాట్లాడే అవకాశం రాలేదు. ఆమె మొదటిసారి తెలుగులో మాట్లాడడం క్రికెట్ అభిమానులను ఆసక్తి రేపుతోంది.