Begin typing your search above and press return to search.

స‌మంత త‌ర్వాత చ‌ర‌ణ్ డెబ్యూ ఇలా!

By:  Tupaki Desk   |   15 Feb 2022 4:41 AM GMT
స‌మంత త‌ర్వాత చ‌ర‌ణ్ డెబ్యూ ఇలా!
X
ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో న‌టించింది స‌మంత‌. రాజీ అనే ఎల్.టి.టి.ఇ తీవ్ర‌వాది పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించింది. స‌మంత కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇది అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు క్రిటిక్స్. ఇన్నేళ్లుగా సినిమాల‌తో రాని గుర్తింపు రాజీ పాత్ర‌తో వ‌చ్చింది. నిజానికి ఇది చాలా మంది ఇత‌ర స్టార్ల‌లో స్ఫూర్తి నింపింద‌నడంలో సందేహ‌మేం లేదు.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఓటీటీ సిరీస్ ల బాట‌లో వెళుతున్నారు. నాగ‌చైత‌న్య కూడా సామ్ బాట‌లోనే వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నాడు. అలాగే నాగార్జున‌- వెంక‌టేష్- రానా స‌హా ప‌లువురు అగ్ర తార‌లు ఓటీటీ సిరీస్ ల‌కు ఓకే చెప్పార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇప్పుడు స‌మంత .. నాగ‌చైత‌న్య బాట‌లోనే రామ్ చ‌ర‌ణ్ కూడా ఓటీటీ లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త్వరలో నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో న‌టించేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ అమెరిక‌న్ సిరీస్ ని భారతీయ ప్రేక్షకుల కోసం రీమేక్ చేయడానికి మేక‌ర్స్ తో చర్చలు జరుపుతోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ టాప్ స్టార్ ని ఎంపిక చేయాలని తొలుత‌ భావించారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ని జాయిన్ చేయ‌డం ద్వారా సౌత్ లోనూ అద్భుతమైన ప్రయోజనం లభిస్తుందని వారు ఆలోచిస్తున్నారు. చరణ్ సీన్ లోకి రావ‌డంతో అంతా మారిపోతోంద‌ని స‌మాచారం.

అమెరికన్ సిరీస్ అంటే భారీ త‌నంతో కూడుకున్న‌ది. విజువ‌ల్ గ్రాఫిక్స్ తో అద్భుతాల‌కు ఆస్కారం ఉంది. అందుకే ఈ రీమేక్ ప్రొడక్షన్ డిజైన్ కు భారీ సెటప్ లు అరుదైన‌ లొకేషన్ లు కూడా అవసరం కాబట్టి చాలా సమయం పడుతుంద‌ని భావిస్తున్నారు. చ‌ర‌ణ్ డీల్ కి ఇంకా సంత‌కం చేయ‌లేదు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకుంటాడని వార్తలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లీకుల ప్రకారం అదే షో కోసం ఒక ప్ర‌ముఖ‌ బాలీవుడ్ దర్శకుడిని ఎంపిక చేయాలనుకుంటోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... చ‌ర‌ణ్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నాడు. అలాగే శంకర్ సినిమాని పూర్తి చేయాల్సి ఉంది. ఆపై జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తాడు. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తోనూ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.