Begin typing your search above and press return to search.

రామానాయుడు స్టూడియోస్ ప్రభుత్వానికి చెందుతుందా?

By:  Tupaki Desk   |   18 July 2021 4:32 AM GMT
రామానాయుడు స్టూడియోస్ ప్రభుత్వానికి చెందుతుందా?
X
మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు ఎంతో ముందు చూపుతో ద‌శాబ్ధాల క్రిత‌మే వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మెజారిటీ పార్ట్ టాలీవుడ్ సినిమాల కీల‌క షెడ్యూల్స్ విశాఖ రామానాయుడు స్టూడియోస్ అర‌కు బెల్ట్ లోనే సాగుతున్నాయి. కేవ‌లం తెలుగు సినిమాలే కాకుండా అటు త‌మిళం.. భోజ్ పురి.. ఒడియా సినిమాల‌ను ఇక్క‌డ చిత్రీక‌రించేందుకు ఆస‌క్తిగా ఉంటారు. ఈ స్టూడియో పూర్తిగా సినిమా టీవీ వినోద‌రంగాల కోసం మాత్ర‌మే సేవ‌లు చేస్తుంది. ఇక్క‌డ ఇత‌ర క‌మ‌ర్షియ‌ల్ వ్యాపారాలు చేయ‌కూడ‌ద‌నే నియ‌మం ప్ర‌కారం.. దీనిని ద‌గ్గుబాటి ఫ్యామిలీ చిత్ర‌సీమ‌కే అంకిత‌మిచ్చింది. హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ లోని రామానాయుడు స్టూడియోస్ .. విశాఖ రామానాయుడు స్టూడియోస్ ని వినోద రంగం కోసం ద‌గ్గుబాటి కాంపౌండ్ వినియోగిస్తోంది.

అయితే విశాఖ‌-తిమ్మాపురం ప‌రిస‌రాల్లో 35 ఎక‌రాల్లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ ని ప్ర‌భుత్వానికి ఇవ్వాల్సిందిగా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కోరుతోంద‌ని ప్ర‌ముఖ మీడియాలో క‌థ‌నాలు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే ఇది నిజ‌మేనా? అని విశాఖ‌ రామానాయుడు స్టూడియోస్ మేనేజ‌ర్ ని ప్ర‌శ్నిస్తే ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.

నిజానికి ప్ర‌భుత్వం నుంచి అధికారులు ఎవ‌రూ ఈ విష‌యంపై సంప్ర‌దించ‌లేదు. అవి కేవ‌లం గాసిప్స్ మాత్ర‌మేన‌ని తెలిపారు. నిజానికి అప్ప‌ట్లోనే స్టూడియోస్ నిర్మించిన స్థ‌లాన్ని ప్ర‌భుత్వం నుంచి రామానాయుడు కొనుక్కున్నారు. అక్క‌డ స్టూడియో నిర్మించ‌డం ఆయ‌న క‌ల‌. దానికోసం అప్ప‌టి మార్కెట్ రేటును చెల్లించి కొనుగోలు చేసార‌ని అది పూర్తిగా నాయుడుగారి స్వార్జిత‌మ‌ని తెలిపారు. ఇక విశాఖ రామానాయుడు స్టూడియోస్ ని ఆనుకుని వైజాగ్ ఎఫ్.ఎన్.సీ.సీని నిర్మించేందుకు ప్ర‌భుత్వం రెండెక‌రాల స్థ‌లం కేటాయించింద‌ని కూడా తెలిసింది. ఇందులో ఎఫ్.ఎన్.సీ.సీ నిర్మాణం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది. విశాఖ బీచ్ లో నాయుడు గారి స్టూడియోని ఆనుకుని బీచ్ వెంబ‌డి ట్రామ్ ట్రెయిన్ ట్రాక్ ని నిర్మించేందుకు ఏపీ ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాల్లో ఉంది. ఇక్క‌డ టూరిజం హ‌బ్ ని తీర్చిదిద్దేందుకు వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నుంది. ఇక ఈ ఏరియాలో ఏపీ కి చెందిన ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు.. తెలంగాణ‌కు చెందిన ప‌లువురు టాప్ గ‌న్స్ ఇక్క‌డ ఎక‌రాల భూమిని కొనుక్కునేందుకు భారీగా పెట్టుబ‌డులు పెట్టార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. వైజాగ్ కైలాస‌గిరి నుంచి భీమిలి వ‌ర‌కూ భారీగా పార్క్ లతో ప‌చ్చ‌ద‌నాన్ని డెవ‌ల‌ప్ చేస్తారు. ఇప్ప‌టికే ఈ ప‌రిస‌రాల్లో బీచ్ రిసార్టుల‌తో బిజినెస్ ఓ రేంజులో సాగుతోంది.