Begin typing your search above and press return to search.

రానాకి తాగాక అలాంటి అల‌వాటుందా?

By:  Tupaki Desk   |   21 March 2021 3:50 AM GMT
రానాకి తాగాక అలాంటి అల‌వాటుందా?
X
దగ్గు‌బాటి రానా న‌టించిన అర‌ణ్య ఈనెల 26న రిలీజ్‌ కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ హిందీ క్లాసిక్ మూవీ `హాథీ మేరా సాథీ` స్ఫూర్తితో రూపొందుతున్న చిత్ర‌మిది. ప్ర‌భు సోల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా టీజ‌ర్- ట్రైల‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా అడ‌వి అందులో ఏనుగుల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే స‌న్నివేశాల‌తో వినూత్న‌మైన ప్ర‌య‌త్నం చేశార‌‌ని అర్థ‌మ‌వుతోంది.

బ‌హుభాష‌ల్లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా రానా ఆరణ్య ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. అత‌డి యూనిక్ ప్ర‌మోష‌న్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. తన సహనటి శ్రియా పిల్గావ్ క‌ర్ తో.. రానా ఒక ఆహ్లాదకరమైన ఆట ఆడారు. ఈ గేమ్ లో ఎప్పుడైనా తాగిన త‌ర్వాత తన మాజీలకు ఫోన్ డయల్ చేశారా? అన్న ప్ర‌శ్న‌ను రానా ఎదుర్కొన్నారు.

దానికి `నెవర్` అంటూ ఆన్స‌ర్ చేశారు. అటు వైపు నుండి కాల్స్ వచ్చాయి. అవి చాలా బావుంటాయి. వయస్సుతో కొన్ని ... కానీ అవే జీవితంలో పాల‌సీగా మారితే స‌రికాదు`` అని వ్యాఖ్యానించారు. మిమ్మ‌ల్ని ఎవ‌రైనా స‌హ‌న‌టి లేదా న‌టుడు కొట్టారా? అని ప్ర‌శ్నిస్తే.. ``సాధారణంగా వారు నన్ను కొట్టే ముందు నేనే వారిపై ప‌డి కొట్టాను`` అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

అలాగే ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సీన్ గురించి చెబుతూ.. అది మ‌నిషితో కాదు.. ఎవ‌రితోనో తెలుసుకోవాల‌నుకుంటే.. ఈ స‌ర‌దా ఆట చూడండి అంటూ ఓ వీడియోని పంచుకున్నారు. మార్చి 26 నుండి థియేటర్లలో ఆరణ్య (తెలుగు)- కదన్ (తమిళం)- హాతి మేరే సాతి (హిందీ) చూడండి! అంటూ ప్ర‌చారం హీటెక్కించారు.