Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: RRR కి ఆ రిస్క్ అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   27 Sep 2021 11:35 AM GMT
ట్రెండీ స్టోరి: RRR కి ఆ రిస్క్ అవ‌స‌ర‌మా?
X
మ‌హా ప్ర‌భుత్వ మ‌హా నిర్ణ‌యంతో బాలీవుడ్ కి ఊపిరొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అక్టోబర్ మూడో వారం నుండి సినిమా థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించడంతో అనేక బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ చిత్రాల విడుదల తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటనలతో వస్తున్నాయి. దాదాపు 20 బాలీవుడ్ సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. వీట‌న్నిటి న‌డుమా అందరి చూపు ఎన్టీఆర్ -రామ్ చరణ్ ల పాన్ ఇండియా మల్టీ స్టారర్ RRR విడుదల తేదీ ప్రకటనపై ఉందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. RRR ఏప్రిల్ 2022 లో థియేటర్లలో విడుద‌ల‌వుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే RRR కి ఈ నిర్ణ‌యం స‌రైన‌దేనా? అంటే ఓ కొత్త తలనొప్పి ఉంది. RRR లో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ న‌టిస్తున్న త‌దుప‌రి థ్రిల్లర్ `మేడే` 2022 ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించాడు.

పాన్ ఇండియా ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవ‌గ‌న్ అతిధి పాత్రలో నటించినప్పటికీ సినిమాలో అతని పాత్ర చాలా కీలకం. ప్ర‌ధాన తార‌ల‌తో కీల‌క స‌న్నివేశాల్లో దేవ‌గ‌న్ క‌నిపిస్తారు. ఉత్తర భారతదేశంలో సినిమా ప్రమోషన్ల సమయంలో అతను ఆర్‌.ఆర్‌.ఆర్ కి చాలా అవ‌స‌రం. ఆయ‌న‌ ముఖంతోనే దీనికి ప్ర‌చారం చేయాలి. అయితే అజయ్ మేడే ఏప్రిల్ ముగింపు విడుదల కావడంతో టీమ్ RRR పెద్ద రిస్క్ తీసుకొని ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తారా? లేక సినిమా అడ్వాన్స్ గా రిలీజ్త తేదీని లాక్ చేస్తారా? ఒక‌వేళ వాయిదా వేసుకుంటుందా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఒకేసారి ఒకే న‌టుడి సినిమా విడుద‌లైతే ఆడియెన్ కి చిన్న పాటి క‌న్ఫ్యూజ‌న్ త‌ప్ప‌నిసరి. అందుకే ఆర్.ఆర్.ఆర్ టీమ్ స‌రైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే భావిస్తున్నారు. ద‌స‌రా - క్రిస్మ‌స్ - సంక్రాంతి- వేస‌వి అంటూ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై క్లారిటీ మిస్స‌యినా 2022 స‌మ్మ‌ర్ కే పాజిబుల్ అన్న అంచ‌నాల న‌డుమ ఏం జ‌రుగుతోందో చూడాలి.

భారీ బెట్టింగ్ తో జ‌ర జాగ‌ర‌త‌

`ఆర్.ఆర్.ఆర్` ఇండియాలోనే అత్యంత‌ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం దాదాపు 400 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు అయింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ అదే మొత్తాన్ని వ‌డ్డీ క‌లిపితే మ‌రో 150 కోట్లు అద‌నంగా ఖ‌ర్చు అయింద‌ని స‌మాచారం. కోవిడ్ స‌హా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని గుస‌గుస వినిపించింది. మొత్తంగా ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్ 550 కోట్లు అయింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇది పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజవుతున్న‌ చిత్రం. ఈ చిత్రాన్ని కేవ‌లం తెలుగు-హిందీలో మాత్రమే తెర‌కెక్కించారు. మిగ‌తా భాష‌ల్లో అనువాద‌మ‌వుతుంది. అంటే దాదాపు స్వ‌దేశంలో అన్ని భాష‌ల్లోనూ ఆర్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతోంది.

ఇంకా ఇతర దేశాల్లో `బాహుబ‌లి` త‌ర‌హాలోనే అనువాదం కానుంది. అంటే ఈ లెక్క‌న బాక్సాఫీస్ బ‌రిలోకి 1000 కోట్ల పైబ‌డిన వ‌సూళ్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగాలి. అప్పుడే ఆర్.ఆర్.ఆర్ బ‌డ్జెట్... లాభాలు ఆశించ‌డానికి అవ‌కాశం ఉంది. మ‌రి ఆ ర‌కంగా చూస్తే సినిమాకు అంత స్టామినా ఉందా? అంటే కాస్త రిస్క్ జోన్ లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎంత బ‌ల‌మైన స్క్రిప్ట్ అయినా హీరోల మార్కెట్ కూడా ఇక్క‌డ అత్యంత కీల‌కంగా మారాల్సి ఉంది. మ‌రి చ‌ర‌ణ్‌.. తార‌క్ బాక్సాఫీస్ స్టామినా ఎంట‌న్న‌ది మ‌రోసారి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌నే అనాలి. ముఖ్యంగా హిందీ ప‌రిశ్ర‌మ నుంచి ఆర్.ఆర్.ఆర్ కి భారీగా ఆదాయం రావాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రం హిందీ రైట్స్ ..శాటిలైట్ రైట్స్ పెన్ స్టూడియోస్ కి క‌ట్ట‌బెట్టారు. పోర్చుగీస్..కొరియ‌న్..ట‌ర్కీష్‌.. స్పానిష్ భాష‌ల డిజిట‌ల్ రైట్స్ ని నెట్ ప్లిక్స్ కి అమ్మేసారు.

తెలుగు..త‌మిళం..క‌న్న‌డం..మ‌ల‌యాళం డిజిట‌ల్ హ‌క్కుల్ని జీ-5కి క‌ట్ట‌బెట్టారు. ఎన్నికోట్ల‌కు ఇప్ప‌టివ‌కూ బిజినెస్ జ‌రిగింద‌న్న‌ది తేలాల్సి ఉంది. అయితే 550 కోట్ల బ‌డ్జెట్ న‌డుమ ద‌ర్శ‌క‌..నిర్మాత‌లపై తీవ్ర‌మైన ఒత్తిడి ఉంద‌ని గుసుగ‌సు వినిపిస్తోంది. సినిమాను కోనుగోలు చేసిన ప్ర‌తీ ఒక్క‌రు లాభ‌ప‌డితేనే సినిమా హిట్ కింద లెక్క‌. ఆ లెక్క‌లో ఎక్క‌డా తేడా జ‌రిగినా బాక్సాఫీస్ లెక్క‌లు మారిపోయే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై డైల‌మా క్లియ‌ర్ కావాల్సి ఉంది. ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ కి వ‌స్తుంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత 2022లోనే వ‌స్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.