Begin typing your search above and press return to search.
సిద్దార్థ ట్వీట్ సమంతను ఉద్దేశించేనా..?
By: Tupaki Desk | 8 Dec 2021 12:43 PM GMTవిడాకుల ప్రకటన తర్వాత కథానాయిక సమంత తొలిసారి తన వ్యక్తిగత జీవితం గురించి నోరు విప్పింది. ఇటీవల ఓ బాలీవుడ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ.. 2021లో తన లైఫ్ లో చోటుచేసుకున్న విషయాల కారణంగా తన కలలన్నీ చెదిరిపోయాయని తెలిపింది. విడిపోయిన తర్వాత కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని.. ఇంత స్ట్రాంగ్ గా ఉండగలనని అనుకోలేదని చెప్పింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ పై కూడా సమంత స్పందించింది.
సోషల్ మీడియా నటీనటుల్ని తమ అభిమానులకు చేరువ చేయడానికి ఎంతో ఉపయోగపడుతోందని సమంత అభిప్రాయ పడింది. కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నానని.. ప్రస్తుతం వాళ్లు తన జీవితంలో భాగమైపోయారని తెలిపింది. అయితే మరికొంత మంది మాత్రం అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ తనని ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
''నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. విభిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉండమని నేనే అందరినీ ప్రోత్సహిస్తాను. కాకపోతే మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని అభ్యర్థిస్తాను'' అని సమంత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెట్టింట సామ్ ఇంటర్వ్యూకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే హీరో బొమ్మరిల్లు సిద్దార్థ్ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ''నేటి విషపూరిత సోషల్ మీడియా ఎకోసిస్టమ్ లో ఫ్యాన్స్ గ్రూప్స్ నిర్వహించడానికి మరియు వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయబడుతున్నాయి. ఏదీ దానంతట అదే జరగదు. వారి 'ఫ్యాన్స్' చివరికి వారిని కూడా కాటేస్తారని 'స్టార్స్' అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి'' అని సిద్దార్థ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
సిద్ధు ట్వీట్ కు నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో సిద్దార్థ పోస్ట్ సమంత ను ఉద్దేశించే అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఇంటర్వ్యూలో చెప్పిన దానికి కౌంటర్ గా.. ఆమె పెంచిపోషించిన అభిమానులే ట్రోల్ చేశారనే అర్థం వచ్చేలా బొమ్మరిల్లు హీరో ట్వీట్ ఉందని అంటున్నారు.
సమంత - నాగచైతన్య వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సమయంలో సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ''మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'' అనే కోట్ ని స్కూల్ లో టీచర్ నుండి నేర్చుకున్న మొదటి పాఠమని సిద్ధు అన్నారు. దీన్ని సామ్ కు అన్వహిస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు మరోసారి సిద్ధార్థ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించే అని చర్చించుకుంటున్నారు.