Begin typing your search above and press return to search.

సుశాంత్ లో ఎవరికి తెలీని క్వాలిటీలు ఆ ఇద్దరూ చెప్పేశారు

By:  Tupaki Desk   |   22 Aug 2021 2:30 PM GMT
సుశాంత్ లో ఎవరికి తెలీని క్వాలిటీలు ఆ ఇద్దరూ చెప్పేశారు
X
ఎదురుపడే అపజయాల్ని పట్టించుకోకుండా అదే పనిగా ప్రయత్నించటం అంత తేలికైన విషయం కాదు. అందునా బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయేలా ఉన్న వేళలో.. తనను తాను ఫ్రూవ్ చేసుకోవటానికి కిందా మీదా పడాల్సిన రావటానికి మించిన ఇబ్బంది ఇంకేం ఉంటుంది. దాదాపులా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నాడు సుశాంత్. తెలుగు సినిమాకు మణిపూస.. నట దిగ్గజం అక్కినేని కుటుంబానికి చెందిన సుశాంత్ తనను తాను నిరూపించుకోవటం కోసం ఇప్పటికి చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ.. ఏ ఒక్కటి ఆయనకు కలిసి రావటం లేదు.

చూసినంతనే నిదానపు మనిషిలా కనిపించే సుశాంత్.. నిజానికి కూల్ గా ఉంటాడు. స్టార్ డమ్ పెద్దగా లేకపోవటంతో అతని క్వాలిటీస్ పెద్దగా బయటకు రాలేదు. కానీ.. అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. వావ్ అనిపించేలా ఉంటాయి. పెద్ద కుటుంబాల్లో ఎవరి గోల వారిదన్నట్లుగా ఉంటుదన్న దానికి భిన్నంగా.. కష్టం అంటే చాలు.. తాను ఉంటానంటూ రీల్ క్యారెక్టర్ లా నిలబడిపోయే లక్షణం సుశాంత్ లో ఎక్కువని చెబుతారు అతని సిస్టర్స్ సాహిత్య.. సంగీతలు. రాఖీ నేపథ్యంలో అక్కినేని మనమడు.. మనమరాళ్లు కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఆకర్షించేలా ఉండటమే కాదు.. సుశాంత్ ను సరికొత్తగా ప్రజెంట్ చేస్తుంది.

ఏదైనా సమస్య వస్తే వెంటనే చక్కని పరిష్కారం చెప్పటం సుశాంత్ కు అలవాటుగా చెబుతారు ఆయన సిస్టర్స్ ఇద్దరూ. అంతేకాదు.. ఇష్యూ అయిపోయిందని వదిలేయకుండా దాన్ని ఫాలో అప్ చేయటంలోనూ అతడికి అతడే సాటి అని కాంప్లిమెంట్ ఇస్తారు. అంతేకాదు.. అమ్మాయిలకు సంబంధించి వారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించే గుణం ఈ మధ్యన ఎక్కువైందట. సమస్య వచ్చినప్పుడు కబుర్లు చెప్పకుండా.. రియాక్టు అయ్యే పద్దతి బాగుంటుందని చెబుతారు.
సుశాంత్ సిస్టర్ సాహిత్య 2017 నుంచి ఇంక్విలాబ్ అనే ఎన్జీవోను నడుపుతుందట. చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందీ సంస్థ. తమ సంస్థ చేసే మంచి పనుల్ని అడగకుండానే సోషల్ మీడియాలో షేర్ చేస్తాడని చెప్పింది. అంతేకాదు.. సుశాంత్ లో సహనం చాలా ఎక్కువట. ఓపిగ్గా అన్ని వింటాడట. ఇంతకీ సినిమాల్లోకి ఎందుకు వచ్చినట్లు అని అడిగితే సుశాంత్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా?

''అమెరికాలో చదువు పూర్తయ్యాక క్యాంపస్‌ ఇంటర్వ్యూలోనే ఓ ఆయిల్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించా. పని ఒత్తిడి ఎక్కువుండేది. జీతం అంతే బావుండేది. సినిమాపై ప్రేమతో ఆర్నెళ్ల ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చా. ఓ రోజు తాతయ్యతో 'సినిమాల్లోకి రావాలనుంద'ని చెప్పా. 'బావున్నావు. ప్రయత్నించు' అన్నారు'' అంటూ విషయాన్ని చెప్పేశాడు.

సక్సెస్.. ఫెయిల్యూర్ గురించి చెప్పమన్నప్పుడు సుశాంత్ రియాక్షన్ ఆకట్టుకుంటుంది. నిజాయితీగా సమాదానం చెప్పాడనిపిస్తుంది. ఇంతకీ అతడేమన్నాడంటే.. ''సినిమాల్లో విజయం, అపజయం రెండూ ఎక్కువగానే కనిపిస్తాయి. ఇది దాచుకునే వృత్తి కాదు. వ్యాపారం చేస్తే లాభ, నష్టాలు ఇతరులకు తెలీవు. అయితే సినిమా అలా కాదు.. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌. సినిమా పోయిందా?లేదా అనే విషయం ఎవరడిగినా చెబుతారు. ఏవీ మన చేతుల్లో ఉండవు. పనిలో లోపం ఉండకూడదు'' అని చెప్పటం చూస్తే.. సుశాంత్ మైండ్ సెట్ ఏమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.