Begin typing your search above and press return to search.

ఆ సౌత్ సూపర్ స్టార్ కి కరోనా లక్షణాలు ఉన్నాయా?

By:  Tupaki Desk   |   28 March 2020 7:10 AM GMT
ఆ సౌత్ సూపర్ స్టార్ కి కరోనా లక్షణాలు ఉన్నాయా?
X
సౌత్ లో ఆయనో పెద్ద స్టార్ హీరో. సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పేరు అందరికీ తెలుసు. గత కొంతకాలంగా రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటున్నారు. అటు రాజకీయాలు ఇటు సినిమాలు.. రెండు పడవల ప్రయాణం చేస్తూ లేటు వయసులో కూడా తనకు ఎనర్జీ ఉందని నిరూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆ స్టార్ హీరో కొద్దిరోజుల క్రితం విదేశీ పర్యటన ముగించుకుని భారతదేశానికి వచ్చారట. అయితే కొంతమంది జఫ్ఫాల తరహాలో బైట తిరుగుతూ అందరీ ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా ఎంతో బాధ్యతాయుతంగా తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారట. అయితే ఇప్పుడు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుల సూచనతో దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటున్నారట. పెద్ద స్టార్ హీరో కావడంతో ఈ విషయం ఎలాగో బయటకు వచ్చింది. దీంతో అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ ఆరోగ్యం విషయంలో కంగారు పడుతున్నారు. ఆ హీరో ఆరోగ్యంగా ఉండాలని.. ఆయనకు ఏమీ కాకూడదని కోరుకుంటున్నారట.

ప్రపంచంలో నిజమైన సమానత్వం ఎక్కడా కనిపించదు కానీ ఈ మాయదారి కరోనా మాత్రం బ్రిటన్ ప్రధానిని ఆఫ్రికాలో బెగ్గర్ ను సమానంగా చూస్తోంది. స్టార్ హీరోలను వదలడం లేదు.. థియేటర్లలో స్వీపర్లను కూడా వదలడం లేదు. రాజు పేద తేడాలే లేవు. వ్యాధి చెడ్డదే కానీ విలన్ కు కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నట్టు ఈ సమానత్వం కాన్సెప్ట్ కరోనా కణకణాలలో జీర్ణించుకుపోయినట్టుంది.