Begin typing your search above and press return to search.
చెప్పుల స్టైల్ ను కాపీ కొట్టాల్సిన అవసరం రౌడీస్టార్ కి ఉందా..?
By: Tupaki Desk | 20 Aug 2022 9:50 AM GMTవిజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నాడు. విడుదల మూడు నాలుగు వారాలు ఉండగానే ముంబయి తో పాటు ఉత్తర భారతంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు.
దేశవ్యాప్తంగా లైగర్ ను భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశ్యంతో విజయ్ దేవరకొండ సాధ్యం అయినన్ని మార్గాల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ జనాల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని విషయాలు ఆయనకు తన ప్రమేయం లేకుండానే ప్రమోషన్ ను తెచ్చి పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. హీరోగా విజయ్ దేవరకొండ ను స్టైలిష్ ఐకాన్ అంటూ యూత్ అభిమానులు అంటూ ఉంటారు. స్టైల్ ను ఫాలో అవ్వకుండా తనదైన కొత్త స్టైల్ ను సెట్ చేస్తూ ఉంటాడు. ఆయన తనకు కంఫర్ట్ అనిపించిన కాస్ట్యూమ్స్ ను వేసుకుంటూ ఉంటాడు.
తాజాగా సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సింపుల్ గా స్లిప్పర్స్ ను ధరించి వచ్చాడు. గతంలో ఒక బాలీవుడ్ హీరో కూడా సినిమా వేడుకలో సింపుల్ గా స్లిప్పర్స్ తో హాజరు అయ్యాడు. ఆ సమయంలో ఉత్తరాదిన ఆ విషయమై తెగ చర్చ జరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్లిప్పర్స్ ధరించి కార్యక్రమంకు హాజరు అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ దేవరకొండ ఆ బాలీవుడ్ హీరోను కాపీ కొట్టాడు అంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు మద్దతుగా కూడా కొందరు ప్రచారం మొదలు పెట్టారు. చెప్పుల స్టైల్ ను కూడా కాపీ కొట్టాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రౌడీ స్టార్ కి కంఫర్ట్ అనిపించినవి ధరిస్తూ ఉంటాడు. అందులో ఆయన్ను తప్పు బట్టడం కాని.. కాపీ అనడం కానీ ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ చెప్పుల విషయంలో కూడా చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల మీడియా సమావేశంలో కాళ్లు టేబుల్ మీద పెట్టడం కూడా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.