Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ కూడా హీరోయిన్‌ సెంటిమెంట్‌ ను నమ్ముతున్నాడా?

By:  Tupaki Desk   |   13 Sep 2020 4:36 AM GMT
సూపర్‌ స్టార్‌ కూడా హీరోయిన్‌ సెంటిమెంట్‌ ను నమ్ముతున్నాడా?
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కు గత అయిదు ఆరు సంవత్సరాలుగా బ్యాడ్‌ టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఏం చేసినా కూడా ఫ్లాప్స్‌ పడుతున్నాయి. దాంతో గత రెండేళ్లుగా కొత్త సినిమానే ఆయన కమిట్‌ అవ్వలేదు. ఎట్టకేలకు సౌత్‌ దర్శకుడు అట్లీ కుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సినిమాకు 'సంకీ' అనే టైటిల్‌ ను కూడా అనుకుంటున్నారట. వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలల్లో సినిమాను ప్రారంభించి అదే ఏడాది క్రిస్మస్‌ వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం షారుఖ్‌ ఖాన్‌ తన స్టార్‌ డంను పక్కన పెట్టి హీరోయిన్‌ సెంటిమెంట్‌ ను నమ్ముతున్నాడా అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు షారుఖ్‌ ఖాన్‌ తో మూడు సినిమాలు చేసిన దీపిక పదుకునే 'సంకీ' సినిమాలో హీరోయిన్‌ గా నటించబోతుంది. ఓం శాంతి ఓం.. చెన్నై ఎక్స్‌ ప్రెస్‌.. హ్యాపీ న్యూ ఇయర్‌ సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. వీరి జోడీకి మంచి పేరుంది. దానికి తోడు వీరి జోడీకి సక్సెస్‌ సెంటిమెంట్‌ ఉంది. కనుక మరోసారి వీరి జోడీ పునరావృతం అవుతుంది. దీపిక పదుకునేను స్వయంగా షారుఖ్‌ ఖాన్‌ ఒప్పించి ఓకే చెప్పించాడట. ఇటీవలే ఆన్‌ లైన్‌ ద్వారా దీపిక కు అట్లీ కథ చెప్పడం జరిగిందని అందుకు కూడా ఆమె ఓకే చెప్పేసింది అంటూ సమాచారం అందుతోంది. దీపిక సెంటిమెంట్‌ తో అయినా షారుఖ్‌ ఖాన్‌ కు సక్సెస్‌ దక్కేనా అనేది చూడాలి.