Begin typing your search above and press return to search.

నానిలాగే సూర్య కూడా మెస్మ‌రైజ్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   4 Feb 2022 2:30 AM GMT
నానిలాగే సూర్య కూడా మెస్మ‌రైజ్ చేస్తాడా?
X
క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు క్రేజీ స్టార్ ల చిత్రాలు ఓటీటీ బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. గ‌త రెండేళ్లుగా కొంత మంది స్టార్ ల చిత్రాలు థియేట‌ర్ ముఖం కూడా చూడ‌ని పరిస్థితి. అయితే రెండేళ్ల త‌రువాత థియేట‌ర్ల‌లో సంద‌డి చేసి సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న వారు కూడా వున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని `గ్యాంగ్ లీడ‌ర్‌` మూవీ త‌రువాత త‌ను న‌టించిన ఏ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కాలేదు. వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన విష‌యం తెలిసిందే.

రెండేళ్ల విరామం త‌రువాత నాని న‌టించిన `శ్యామ్ సింగ రాయ్‌` థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అనూహ్య విజ‌యాన్ని సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు ఇదే హీరో త‌ర‌హాలో మ‌రో హీరో సూర్య రెండేళ్ల విరామం త‌రువాత త‌న తాజా చిత్రంతో థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాడు. సూర్య న‌టించిన ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జై భీమ్ చిత్రాలు థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో విడుద‌లై అనూమ్య విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. దీంతో సూర్య సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `ఎత‌ర్కమ్ తున్నింధావ‌న్‌` థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సూర్య ఈ చిత్రాన్ని పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేశారు. భారీ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రాన్ని ముందు ఫిబ్ర‌వ‌రి 4న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

కానీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ చిత్ర రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేసి మార్చి 10న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. సూర్య చిత్రాల‌కు ఓటీటీలో మంచి ఆఫ‌ర్ ల‌భిస్తున్న నేప‌థ్యంలో ఈ మూవీని కూడా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ ఈ మూవీని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఓటీటీ రిలీజ్ వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది.

ఈ చిత్రంలో సూర్య చాలా భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. డేర్ డెవిల్ పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు. గ్రామీణ యువ‌కుడిగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో స‌రికొత్త మేకోవ‌ర్ తో సూర్య న‌టించిన ఈ మూవీలో ఆయ‌న‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టించింది. విన‌య్ రాజ్‌, స‌త్య‌రాజ్‌, రాజ్ కిర‌ణ్‌, శ‌ర‌ణ్య పొన్ వ‌న్న‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రెండేళ్ల విరామం త‌రువాత థియేట‌ర్ల లో సంద‌డి చేసిన నాని త‌ర‌హాలో `ఎత‌ర్కమ్ తున్నింధావ‌న్‌` తో సూర్య కూడా మెస్మ‌రైజ్ చేస్తాడా? అన్న‌ది తెలియాలంటే మార్చి 10 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.