Begin typing your search above and press return to search.
వర్మ మార్షల్ ఆర్ట్స్ కంటే మసాలా ఎక్కువ చూపిస్తున్నాడా..??
By: Tupaki Desk | 25 Dec 2020 10:53 AM GMTవివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'ఎంటర్ ది గళ్ డ్రాగన్' సినిమా ప్రకటించిన టైం నుండి అందులో హీరోయిన్ పూజ భాలేకర్ పైనే అందరి కళ్లు.
ఫోటోలతో, సాంగ్ టీజర్లతో రెచ్చగొట్టిన వర్మ.. ట్రైలర్ విడుదల చేసి 'అబ్బా పూజా ఏం కిక్ కొట్టిందరా..!' అని ఆశ్చర్యపోయారు. ముంబైకి చెందిన పూజా భాలేకర్.. చిన్నప్పట్నుంచీ యాక్టింగ్ పిచ్చితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందట. అలాగే ఓవైపు మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కానీ అటు ఇటు వెళ్లి మొత్తానికి పూజా రాంగోపాల్ వర్మ చేతిలో పడింది. ఇక ఛాన్స్ దొరికింది కదా అని ఈ సినిమా కోసం ఆ స్టైల్ మార్షల్ ఆర్ట్స్‌లో ఫుల్ ట్రైనింగ్ తీసుకుంది. ట్రైలర్ చూస్తే పూజా కష్టం నిజమేనని అర్థమవుతోంది. ఓ ఫైట్ సీన్‌లో చీరలోంచి ఇచ్చే ఓ కిక్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ భామ అందాల ఆరబోతకి కూడా సిద్ధమే. అందుకే ఎక్కడా తగ్గకుండా బికినీలో కూడా ఫైట్స్ చేస్తూ నటించింది. ఇక ఇటీవలే 'ఎంటర్ ది గళ్ డ్రాగన్' ట్రైలర్ బ్రూస్లీ పుట్టిన రోజున రిలీజై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కానీ వర్మ వివాదాస్పద దర్శకుడు కదా.. భారత్‌లోనే తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా అని చెప్పుకొస్తున్నాడు. టీజర్ ట్రైలర్స్ చూస్తే మాత్రం సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కంటే ఎక్కువగా మసాలా సన్నివేశాలే ఉన్నాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వీటన్నింటికి సమాధానంగా వర్మ.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ క్లిప్స్ విడుదల చేశాడు. ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలు డూప్ కాదని చెప్పాడు. హీరోయిన్ పూజా భాలేకర్ తైక్వాండో మార్షల్ ఆర్టిస్ట్ అని, కానీ బ్రూస్‌లీ స్టైల్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని వర్మ తెలిపాడు. ఈ వీడియోలో పూజా డెడికేషన్ కి ఆర్జీవీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ట్రైలర్ చూసి కామెంట్ చేసిన వాళ్లు ఇప్పుడు ట్రైనింగ్ వీడియో చూసి నోళ్లు వెల్లబెడుతున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్ట్ చూసి పూజా పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అంటే విశేషమే కదా.. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో..!!