Begin typing your search above and press return to search.
విశాల్ ఈ సారైనా మ్యాజిక్ చేస్తాడా?
By: Tupaki Desk | 2 Feb 2022 8:51 AM GMTవిశాల్ గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ లని మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు. గత మూడేళ్లుగా వరుసగా విశాల్ నటించిన ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఏ సినిమా కూడా తను ఆశించిన స్థాయిలో సక్సెస్‌ని అందించలేకపోయింది. ఒక సారి కథ ఇబ్బందిగా మారితే మరోసారి దర్శకుడు తీసిన విధానం బాగా లేకపోవడంతో విశాల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో ఈ దఫా ఖచ్చితంగా హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో వున్నాడు విశాల్. తను నటించిన తాజా చిత్రం `సామాన్యుడు`. `నాట్ ఏ కామన్ మెన్ ` అని ట్యాగ్ లైన్. తు పా శరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో `వీరమాయే వాడై సూడుమ్` అనే నేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మర్డర్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ ఏ సర్టిఫికెట్ లభించింది.
వాస్తవికతకు అద్దంపడుతూ ఓ సామాన్యుడు అసాంఘిక శక్తులపై చేసే సమరంగా ఈ మూవీని రూపొందించారు. డింపుల్ హయాతీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మల్లిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ తో కలిసి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై హీరో విశాల్ నిర్మించారు. ఇందులో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి సంబంధించి 2.35 నిమిషాల నిడివిగల స్నీక్ పీక్ ని ఇటీవల విడుదల చేశారు. ఇందులో ఓ హోటల్ లో జరిగే ఫైట్ ని పూర్తిగా చూపించి సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.
చాలా రోజుల తరువాత విశాల్ చాలా కేర్ తీసుకుని ప్రమాదాలని సైతం లెక్కచేయకుండా ఈ చిత్రం కోసం రిస్క్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన స్నీక్ పీక్ లోని చూపించిన హోటల్ ఫైట్ లో విశాల్ పై బాటిల్స్ విసరడం వల్ల గాయాలయ్యాయి. అయినా సరే గాయాలని లెక్కచేయకుండా ఈ మూవీని విశాల్ పూర్తి చేశాడు. దీంతో ఈ మూవీపై విశాల్ భారీ అంచనాలు పెట్టుకున్నారని, ఈ చిత్రంతో మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ ల బాట పట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.

అయితే విశాల్ నమ్మకాన్ని `సామాన్యుడు` ఎంత వరకు నిజం చేస్తారన్నది తెలియాలంటే ఈ నెల 4 వరు వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి తెలిసిన వాళ్లంతా వివాల్ ఈ సారైనా మ్యాజిక్ చేసి సక్సెస్ బాట పడతాడా? అని ఇండస్ట్రీ వర్గాలు ఆరాతీస్తున్నాయి.