Begin typing your search above and press return to search.
ఆర్‌ఆర్ఆర్ కి యంగ్ హీరో సినిమా టెన్షన్ తప్పింది
By: Tupaki Desk | 2 March 2022 11:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈనెల 25వ తారీకున విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా వల్ల ఇప్పటికే పలు సార్లు వాయిదాలు పడ్డ ఈ సినిమా ను ఈసారి అయినా విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో డౌట్ అక్కర్లేదు.. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మేకర్స్ మరోసారి ప్రకటించారు. సంక్రాంతి కి వాయిదా పడ్డట్లుగా ఈసారి వాయిదా పడదని తేల్చి చెప్పారు.
మార్చి 25వ తారీకున ఆర్ ఆర్ ఆర్ సినిమా అనడంతో ఆ దరి దాపున కూడా రాకుండా ఇతర తెలుగు సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి. ముందు ఒక వారం తర్వాత కనీసం రెండు వారాలు ఈ సినిమాకు కేటాయించేశారు. కాని ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమాకు పోటీ తప్పడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సోలో రిలీజ్ సాధ్యం అవ్వడం లేదు.
ఇతర భాషల్లో చిన్న సినిమాలు కాకున్నా పెద్ద సినిమాలు పోటీ లేకుండా చేసుకునేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళ క్రేజీ హీరో సక్సెస్ ఫుల్ స్టార్ శివ కార్తికేయన్ నటించిన డాన్ సినిమా ను వాయిదా వేయించారు. మార్చి 25వ తారీకునే డాన్ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కు పోటీ గా శివ కార్తికేయన్ వచ్చేందుకు సిద్దం అయ్యాడు. కాని ఆయన్ను జక్కన్న టీం నిలువరించే ప్రయత్నం చేసి సఫలం అయ్యింది.
శివ కార్తికేయన్ తన డాన్ సినిమా ను మార్చి 25న కాకుండా మే 13వ తారీకున విడుదల చేసేందుకు ఓకే చెప్పడం జరిగింది. ఆ విషయమై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు అధికారికంగా ప్రకటన చేయడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శివ కార్తికేయన్ గత చిత్రం డాక్టర్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న ఆ సినిమా విజయం తో శివ కార్తికేయన్ స్థాయి మరింతగా పెరిగింది.
డాక్టర్ సినిమా స్థాయిలోనే డాన్ కూడా ఉంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. అంతకు మించి వసూళ్లు నమోదు అవుతాయని అంతా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఖచ్చితంగా డాన్ పోటీ అవుతుందనే ఉద్దేశ్యంతో జక్కన్న టీమ్ కార్తికేయన్ టీమ్ ను ఒప్పించి వాయిదా వేయించాయి అంటూ తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. పోటీ లేకుండా రావడం మంచిదే. ఆర్ ఆర్ ఆర్ కు పోటీ వల్ల డాన్ కు కూడా చాలా పెద్ద నష్టం.. ఇబ్బంది తప్పదు. కనుక వాయిదా వేసుకోవడం ఇద్దరికి కూడా మంచిదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.