Begin typing your search above and press return to search.
పదే పదే వాయిదా పడిన డాన్ 3 ఎట్టకేలకు..!
By: Tupaki Desk | 21 Jun 2022 6:30 AM GMTకింగ్ ఖాన్ షారూక్ .. ఆల్ రౌండర్ ఫర్హాన్ అక్తర్ కాంబినేషన్ లో'డాన్' ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కాంబినేషన్ లో డాన్- డాన్ 2 చిత్రాలు వచ్చాయి. డాన్ పెద్ద సక్సెసైంది. డాన్ 2 కి డివైడ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత చాలా కాలంగా డాన్ సిరీస్ గురించి ఫర్హాన్ ఆలోచించలేదు. కానీ ఈ ఫ్రాంఛైజీ నుంచి పార్ట్ 3 వస్తుందని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు.
తాజా సమాచారం మేరకు .. షారూఖ్ ఖాన్ దశాబ్దం తర్వాత డాన్ గా తిరిగి వస్తున్నాడని.. ఫర్హాన్ అక్తర్ డాన్ 3 స్క్రిప్ట్ పై పని ప్రారంభించాడని టాక్ వినిపిస్తోంది. ముంబై మీడియా సోర్స్ ప్రకారం.. డాన్ (1978) అసలు సృష్టికర్త అయిన తన తండ్రిగారు జావేద్ అక్తర్ తో కలిసి ఫర్హాన్ ఇప్పుడు 'డాన్ 3' స్క్రిప్టు గురించిన పని మొదలు పెట్టారని తెలిసింది.
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న 'జీ లే జరా' సినిమాని ఫర్హాన్ కొంతకాలం పాటు హైడ్ లో ఉంచి 'డాన్ 3' స్క్రిప్టుపై దృష్టి సారించారని తెలిసింది. ప్రియాంక చోప్రా- కత్రినా కైఫ్- అలియా భట్ ల మధ్య కాల్షీట్ల సమస్యల కారణంగా ఫర్హాన్ అక్తర్ 'జీ లే జరా'ను ప్రస్తుతానికి షూట్ లేకుండా వెయిటింగులో ఉంచారు. ఈ తీరిక సమయంలో అతడు కొత్త స్క్రిప్ట్ పై పని చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం డాన్ 3 స్క్రిప్టు కోసమే అతడు తన తండ్రిగారితో కలిసి పని చేస్తున్నారు.
నిజానికి డాన్ టైటిల్ కి ఉన్న ఇమేజ్ వేరు. ఆ స్థాయి స్క్రిప్టు నేరేషన్ చాలా ఇంపార్టెంట్. పైగా ఇటీవల మారిన పాన్ ఇండియా ట్రెండ్ లో డాన్ 3 కోసం ఒక ఆలోచనను రూపొందించడానికి లేదా పూర్తి స్క్రిప్టును అభివృద్ధి చేయడానికి చాలా సమయం పడుతుంది. ప్రతిసారీ ఐడియాను ఎంపిక చేసుకున్నా కానీ కొత్తదనం లేకపోవడం వల్లనే పదే పదే ఈ ప్రాజెక్టును ఆపేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. కానీ టీమ్ ఎట్టకేలకు ఆ ఫ్రాంచైజీని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే బెటర్ ఐడియాని లాక్ చేసిందని సమాచారం. ఫర్హాన్ స్క్రిప్ట్ రాయడం ప్రారంభించాడు. తన తండ్రి సీనియర్ రచయిత జావేద్ తో కలిసి పనిని వేగవంతం చేసాడు. కథను ఆయన అందించగా.. స్క్రీన్ ప్లేని ఫర్హాన్ ఇస్తాడు. స్క్రీన్ ప్లే లాక్ అయిన తర్వాత SRK కి బౌండ్ స్క్రిప్టును వినిపిస్తారు.
ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తు దేనిపై ఆధారపడి ఉంది? అంటే.. స్క్రీన్ ప్లే ఏ తరహాలో షేపప్ అవుతుంది? ఖాన్ ని మెప్పిస్తుందా లేదా? అన్నదానిపై ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. గత కొన్ని ప్రయత్నాలకు భిన్నంగా 3వ భాగాన్ని రూపొందించాలనేది టీమ్ ఆలోచన. ఈ ప్రాజెక్ట్ కి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ వంద శాతం ఔట్ పుట్ కోసం తపిస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
అమితాబ్ బచ్చన్ క్లాసిక్ 'డాన్'కి షారూక్ బృందం అధికారిక రీమేక్ గా డాన్ ని రూపొందించారు. ఆ తర్వాత డాన్ 2తో స్వతంత్ర ఫ్రాంచైజీగా మారింది. డాన్ 2 విడుదలై ఇప్పటికే ఒక దశాబ్దం అయింది. ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని ప్రకటిస్తారని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఫర్హాన్ - రితేష్ సిధ్వానీ (నిర్మాత) ఇద్దరూ డాన్ 3పై తమ ప్లాన్ ల గురించి పదే పదే ఓపెన్ చేసినప్పటికీ.. అధికారిక ప్రకటన ఇప్పటివరకూ రాలేదు. జీ లే జారా కు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు డాన్ 3 కోసం ఈ బృందం పని చేస్తోంది. త్వరలోనే ప్రకటన వెలువడుతుందని కూడా టాక్ వినిపిస్తోంది.