Begin typing your search above and press return to search.

అవకాశం అడిగితే.. డైరెక్టర్ తనతో గడపమన్నాడు: నటి

By:  Tupaki Desk   |   23 Dec 2020 9:31 AM GMT
అవకాశం అడిగితే.. డైరెక్టర్ తనతో గడపమన్నాడు: నటి
X
నటనలో అవకాశాలు ఓ డైరెక్టర్ తనతో గడమన్నాడని ‘దిల్‌ తో హ్యాపీ హై జీ’ ఫేమ్‌ డోనాల్‌ బిష్ట్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌ స్మాల్‌ స్క్రీన్‌లో దూసుకుపోతున్న డోనాల్.. వరుస అవకాశాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. జర్నలిస్ట్‌ అయిన బిష్ట్..‌ నటన మీద ప్రేమతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోనాల్‌.. కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి వెల్లడించారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ డైరెక్టర్‌ తనతో చాలా నీచంగా మాట్లాడాడని.. దాంతో అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

సెలక్ట్ చేశారు.. తొలగించారు..
ప్రారంభంలో తనను ఓ షో కోసం సెలక్ట్‌ చేశారని, రెమ్యూనరేషన్‌ కూడా ఫైనల్‌ అయిన తర్వాత ఆకస్మాత్తుగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి తొలగించారని డోనాల్ తెలిపింది. ఈ సంఘటనతో ఇండస్ట్రీ, ముంబై జనాలు అంటేనే అబద్దం, నకిలీ వ్యక్తులు అనే అభిప్రాయం తనతోపాటు కుటుంబ సభ్యులకూ ఏర్పడిందన్నారు. అయితే.. నటన మీద తనకున్న పిచ్చి వల్ల ఆడిషన్లకు వెళ్లడం మాత్రం మానలేదని చెప్పారు.

ఇలా అవకాశాల వేటలో ఉండగా సౌత్‌లో ఇంతకన్నా భయంకరమైన అనుభవం ఎదురయ్యిందని వాపోయింది డోనా. ఓ డైరెక్టర్‌ అవకాశం ఇస్తాను కానీ.. అందుకు ప్రతిగా తనతో గడపాలని కోరాడని ఆవేదన చెందింది. వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది బిష్ట్. ‘నేను నా కష్టాన్నే నమ్ముకున్నాను. దానివల్ల ఇండస్ట్రీలోకి రావడానికి కాస్త ఎక్కువే శ్రమించాను. కానీ సరైన మార్గంలో ఇక్కడ ప్రవేశించాను’ అన్నారు. ఈ‌ సంఘటనతో ముంబైకి మారానని.. ఆ తర్వాత తన ప్రతిభను గుర్తించిన దర్శకులు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారని చెప్పిండి డోనాల్. ఆ తర్వాత నుంచి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పింది.