Begin typing your search above and press return to search.

ట్రంపూ.. ఆ హీరోయిన్ గురించి ఆపూ!!

By:  Tupaki Desk   |   10 Jan 2017 6:52 AM GMT
ట్రంపూ.. ఆ హీరోయిన్ గురించి ఆపూ!!
X
మొన్న రాత్రి జరిగిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.. అనేక సెటైర్లకు వేదికైంది. అయితే ఆ సెటైర్లన్నీ కూడా త్వరలో అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్ట్ ట్రంప్ గురించి వేసినవే కావడం విశేషం. అందరూ కూడా యాంటీ ట్రంప్ వాయిస్ తో చితక్కొట్టేశారు. వ్యాఖ్యాత జిమ్మీ ఫేలన్ దగ్గర నుండి ప్రముఖ నటి మెరిల్ స్ర్టీప్ వరకు.. అందరూ ఆడేసుకున్నారంతే.

అయితే మెరిల్ స్ర్టీప్ కాస్త ఘాటుగా కామెంట్ చేస్తూ.. గత సంవత్సరం ఒక అత్యున్నత స్థాయి సీట్లో కూర్చున ఒక పెద్దాయన ఒక హ్యాండీకాపెడ్ జర్నలిస్టును వెక్కిరిస్తూ కామెంట్ చేశాడు. అదే అత్యంత అద్భుతమైన పెర్ఫామెన్స్. కాకపోతే అది సినిమాల్లో చేసింది కాదు కాబట్టి.. అవార్డు మాత్రం రాలేదు అంటూ చురకలు వేసింది. దీనిపై స్పందించిన ట్రంప్.. నేను అలాంటి ఇమిటేషన్లు చేయలేదు అంటూ ఖండించాడు. అంతవరకు ఓకె.. కాని మనోడు మాత్రం ''అమెరికాలో బాగా ఓవర్ రేటెడ్ నటీమణి'' అంటూ మెరిల్ స్ర్టీప్ గురించి కామెంట్ చేయడం.. అబ్బే తప్పు కాదు బూతు అన్నట్లుంది.

67 ఏళ్ళ మెరిల్ స్ర్టీప్ తన కెరియర్లో ఎన్నో హైస్ అండ్ లోస్ చూసింది. అలాగే 19 సార్లు ఆమె ఆస్కార్ అవార్డులకు ఉత్తమ నటి లేదా సహాయ నటి కేటగిరీల్లో నామినేట్ అయ్యి.. 4 సార్లు ఆస్కార్లు గెలిచిందంటే.. ఆమె నటనా ప్రావిణ్యం ఏమిటో మనం అర్దం చేసుకోవచ్చు. అలాంటి ఒక నటిని ఓవర్ రేటెడ్ అనడం.. బహుశా ట్రంప్ రేటింగ్స్ ను ఇరకాటంలో పడేస్తోంది మరి. ప్రెసిడెంటు గారూ.. వై దిస్ కొలవెరి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/