Begin typing your search above and press return to search.

నానికి ట్రంప్ పంచ్ పడుతుందేమో..

By:  Tupaki Desk   |   1 Feb 2017 9:48 AM GMT
నానికి ట్రంప్ పంచ్ పడుతుందేమో..
X
‘భలే భలే మగాడివోయ్’తో నాని దశ తిరిగిపోయింది. అమెరికాలో ఆ సినిమా అనూహ్యంగా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లకు చేరువగా వెళ్లింది. ఈ ఊపులో నాని తర్వాతి సినిమాలు కూడా అమెరికాలో బాగానే పెర్ఫామ్ చేశాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.. ‘జెంటిల్మన్’.. ‘మజ్ను’ సినిమాలు మూడూ కలిపి 2.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేశాయి. నాని లేటెస్ట్ మూవీ ‘నేను లోకల్’ మీద ఉన్న పాజిటివ్ బజ్ చూస్తుంటే ఈ చిత్రం ఈజీగా మిలియన్ మార్కును అందుకుంటుందన్న అంచనాలున్నాయి. నాని వరుస హిట్లతో ఊపుమీదుండటం.. పైగా ఈ సినిమాపై మొదట్నుంచి మంచి అంచనాలుండటం.. దీనికి తోడు సంక్రాంతి సినిమాల జోరు తగ్గిపోతున్న సమయంలో మంచి టైమింగ్ లో ఈ సినిమా రిలీజవుతుండటం కలిసొచ్చే అంశాలు.

ఐతే అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అనుకోని ఇబ్బంది తలెత్తింది ‘నేను లోకల్’కు. హెచ్-1 బి వీసాలపై ఆంక్షలు.. కనీస వేతనానికి సంబంధించిన నిబంధనలు వంటి పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని ఎన్నారైలందరూ ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు ప్రస్తుతం. భవిష్యత్ గురించి బెంగతో.. మున్ముందు ఎలాంటి పరిణామాలుంటాయో అన్న ఆందోళనతో కలవరపడుతున్నారు అక్కడి జనాలు. వాళ్ల మూడ్ ప్రస్తుతం ఏమంత బాగా లేదు. ఇలాంటి తరుణంలో సినిమాలపై ఏమాత్రం ఆసక్తి చూపిస్తారో అన్న సందేహాలున్నాయి. ముస్లిం దేశాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికా అంతటా కూడా ఒక ఉద్వేగపూరితమైన వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. వీకెండ్ సమయానికి ఇవి మరింత ఉద్ధృతం కావచ్చు. దీంతో జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం బయట తిరిగే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలు ‘నేను లోకల్’కు ప్రతికూలం కావచ్చు. ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఈ సినిమాకు భారీ వసూళ్లు ఆశించలేరేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/