Begin typing your search above and press return to search.
తమిళనాడు సీఎం ఫండ్ కి నిధి లక్ష విరాళం
By: Tupaki Desk | 18 May 2021 3:36 PM GMTకోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాద తీవ్రత చూస్తున్నదే. మహమ్మారీని ఎదుర్కొనేందుకు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో సెలబ్రిటీలు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ కూడా తనవంతు సోషల్ మీడియాల్లో ప్రచారానికి ముందుకొచ్చి జనజాగృతం చేస్తున్నారు.
దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ పడక(బెడ్)ల సమాచారాన్ని `ఫైండ్ ఏ బెడ్` పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్ నిధి ప్రచార సాయం చేస్తున్నారు. మీరు మీ సమీప COVID కేంద్రాన్ని కనుగొనవచ్చు. దేశం కోసం యువత చేసిన చొరవ కోసం కాజ్ అంబాసిడర్ గా నా వంతు సాయం చేయడం ఆనందంగా ఉంది! అని తాజా ఇన్ స్టా పోస్ట్ లో అన్నారు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు నిధి అగర్వాల్. కోవిడ్ రోగుల సహాయార్థం ఈ నిధి చేరుతుంది. ఇటీవల కరోనా వల్ల సినిమాల చిత్రీకరణలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. పవన్ హరిహర వీరమల్లు చిత్రంలో నిధి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.