Begin typing your search above and press return to search.

'దొంగలున్నారు జాగ్రత్త' ట్రైలర్: కారులో ఇరుక్కపోయిన దొంగ సర్వైవ్ అవుతాడా?

By:  Tupaki Desk   |   15 Sep 2022 6:00 AM GMT
దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్: కారులో ఇరుక్కపోయిన దొంగ సర్వైవ్ అవుతాడా?
X
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నిలదిక్కుకోడానికి కష్టపడుతున్నాడు. 'మ‌త్తు వ‌ద‌ల‌రా' అనే సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీ సింహా.. 'తెల్ల‌వారితే గురువారం' చిత్రంతో మెప్పించారు. వైవిధ్యమైన సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్న యువ హీరో.. ఇప్పుడు ''దొంగలున్నారు జాగ్రత్త'' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాతో సతీష్ త్రిపుర ద‌ర్శ‌కుడిగా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో శ్రీ సింహ సరసన ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించింది. విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

ఇప్పటికే విడుదలైన 'దొంగలున్నారు జాగ్రత్త' పోస్టర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు లేటెస్టుగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇది తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంగా పేర్కొనబడింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది.

ఇందులో రాజు అనే ఒక చిన్న దొంగగా శ్రీ సింహా కనిపించాడు. స్పెషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న ఒక ధనవంతుడి కారు లాక్ తీసి లోపలికి వెళ్లిన అతను.. అక్కడే బంధించబడ్డాడు. డోర్స్ ఓపెన్ కావడం లేదు.. కంట్రోల్ ప్యానెల్ కూడా స్పందించడం లేదు.

ఇప్పుడు రాజు కు కారు ఒక పంజరంలా మారింది. అక్కడి నుంచి బయటపడటానికి అతనికి మార్గం కనిపించడం లేదు. నిజానికి అతను ఓ ఉచ్చులో చిక్కుకున్నాడు. అయితే కారు నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అద్దాలు పగల కొట్టడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు.

కారుపై పూర్తి నియంత్రణ కోల్పోతున్న సమయంలో అందులో ఒక టైం బాంబ్ ను కనుగొంటాడు. దీంతో రాజు సర్వైవ్ అవ్వడానికి టైం తో పోటీ పడాల్సి వచ్చింది. చివరకు దీని వెనుక ఓ అదృశ్య శత్రువు ఉన్నట్లు చూపించారు. గుడ్ బై చెప్పడానికి అతన్నుంచి ఫోన్ కాల్ కూడా వస్తుంది.

రాజు ఆ కారులో నుంచి బయటపడి సర్వైవ్ అవుతాడా లేదా? అసలు శత్రువుకు ఏం కావాలి? ఎందుకు రాజు ను టార్గెట్ చేసాడు? అనేది తెలియాలంటే 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమా చూడాల్సిందే. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అధిక భాగం కారులో జరుగుతుందని అర్థమవుతోంది.

సతీష్ త్రిపుర మొదటి సినిమాకే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌ ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఈ గ్రిప్పింగ్ సర్వైవల్ థ్రిల్లర్‌లో చాలా థ్రిల్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రీ సింహా నటనలో వెరీయేషన్ చూపించాడు. అయితే ఇందులో సముద్ర ఖని - ప్రీతి అస్రాని లను చూపించలేదు.

సినిమాటోగ్రాఫర్ యశ్వంత్ సి విజువల్స్ మరియు సంగీత దర్శకుడు కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ అభినందనీయం. ఎడిటర్ గ్యారీ బిహెచ్ ట్రైలర్ కట్ క్రిస్ప్ అండ్ షార్ప్‌ గా ఉంది. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిందని చెప్పాలి. గాంధీ నడికుడికార్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు.

'దొంగలున్నారు జాగ్రత్త' చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ - గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై డి. సురేష్ బాబు - సునీత తాటి సంయుక్తంగా నిర్మించారు. 'ఓ బేబీ' 'శాకినీ డాకినీ' తర్వాత వీరి కలిసి నిర్మించిన మూడో సినిమా ఇది. మంజార్ స్టూడియోస్ సంస్థ దీని నిర్మాణంలో భాగం పంచుకుంది

'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు. శ్రీ సింహా కు ఈ స్పెషల్ థ్రిల్లర్ ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.