Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్' పై ఎలాంటి రూమర్స్ నమ్మకండి..!
By: Tupaki Desk | 7 Sep 2022 2:38 PM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకున్న ప్రకారం విడుదల కావడం లేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
'గాడ్ ఫాదర్' సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు పెండింగ్ లో ఉండటమే రిలీజ్ పోస్ట్ పోన్ చేయడానికి కారణంగా చెబుతున్నారు. రీ-రికార్డింగ్ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని.. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సమయం కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చని.. అందుకే డిసెంబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఒట్టి పుకార్లని కొట్టి పారేశారు. చెప్పిన సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ''ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. త్వరలోనే ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నాం'' అని నిర్మాత ఎన్‌వి ప్రసాద్ తెలిపారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా చిరంజీవి సినిమాకి దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదని మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'గాడ్ ఫాదర్' పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రూమర్స్ క్రియేట్ అవ్వడం ఫ్యాన్స్ ని గందరగోళానికి గురి చేసింది. అయితే ఇప్పుడు మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'గాడ్ ఫాదర్' తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార - సత్యదేవ్ - సునీల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నుంచి రాబోతున్న 'గాడ్ ఫాదర్' ఎలాంటి విజయ5సాధిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.