Begin typing your search above and press return to search.
#RRR రూమర్స్.. ఇదీ ప్రొడ్యూసర్ మాట
By: Tupaki Desk | 8 Jun 2018 12:07 PM GMT#RRR ప్రాజెక్ట్ విడుదలైన తరువాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో గాని ఆ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ అంటే రూమర్స్ రావడం సహజమే కానీ ఈ మధ్య వాటి డోస్ చాలా ఎక్కువయ్యింది. ఇక రాజమౌళి హీరోలు సినిమా గురించి ఏ విధంగా స్పందించకపోవడంతో కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి.
ఈ మల్టీస్టారర్ 1995 లో వచ్చిన కరణ్ అర్జున్ అనే బాలీవుడ్ సినిమాకు రిమేక్ అనే కామెంట్స్ వచ్చాయి. సల్మాన్ షారుక్ ఆ సినిమాలో కనిపించగా రీమేక్ లో చరణ్ ఎన్టీఆర్ కనిపిస్తారని చెప్పడం వైరల్ అయ్యింది. అలాగే ఈగ - మగధీర తరహాలో పునర్జన్మల కాన్సెప్ట్ ఉంటుందని మరికొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇక ఫైనల్ గా నిర్మాత డివివి.దానయ్య ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.
వాటిలో ఎలాంటి నిజం లేదని ఇప్పటివరకు తారక్ - చరణ్ తప్ప సినిమాలో ఏ ఒక్క పాత్రని కూడా ఫైనల్ చేయలేదని చెప్పారు. అదే విధంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ లో మొదలు పెట్టి 2020లో ఫినిష్ చేసి అదే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఇక సినిమాకు సంబందించిన వివరాలను ఒక నెలలో అందరికి తెలుస్తాయని అప్పుడు అందరికి ఒక అవగాహనా వస్తుందని దానయ్య తెలిపారు.