Begin typing your search above and press return to search.
మైసూర్ పాక్.. ఆలూ చిప్స్ తెస్తేనే ఇంటికిరా
By: Tupaki Desk | 27 Jan 2020 4:46 AM GMTబాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్.. దీపిక పదుకునే. ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఒకరి పై ఒకరు చేసుకునే కామెంట్స్.. ఒకరి గురించి ఒకరు పంచుకునే పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి వీరిద్దరి మద్య సోషల్ మీడియా రొమాన్స్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం '83' చిత్రం ప్రమోషన్ లో రణ్ వీర్ సింగ్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే చెన్నై కు రణ్ వీర్ సింగ్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ప్రమోషన్ కు వెళ్లడం జరిగింది.
సినిమా ప్రమోషన్ కోసం వెళ్లిన రణ్ వీర్ సింగ్ ను వచ్చేప్పుడు శ్రీ కృష్ణలో 1 కేజీ మైసూర్ పాక్ మరియు హాట్ చిప్స్ నుండి 2 1/2 కేజీల స్పైసీ హాట్ ఆలూ చిప్స్ తీసుకు రమ్మంటూ పోస్ట్ చేసింది. ఒక వేళ అవి కనుక తీసుకు రాకుంటే ఇంట్లోకి రావద్దంటూ సరదాగా దీపిక పోస్ట్ చేసింది. దీపిక మాత్రమే కాకుండా 83 చిత్ర దర్శకుడు కబీర్ సింగ్ భార్య కూడా ఇదే విధంగా మైసూర్ పాక్ మరియు ఆలూ చిప్స్ తీసుకు రమ్మంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండియాకు మొదటి ప్రపంచ కప్ ను అందించిన కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటించాడు. 1983 సంవత్సరంలో ఇండియా మొదటి ప్రపంచ కప్ అందుకున్న సమయంలో జట్టు సభ్యుల ఫీలింగ్స్ ఏంటీ.. అసలు ఇండియాలో అప్పుడు క్రికెట్ పరిస్థితి ఎలా ఉంది.. ప్రపంచ కప్ కోసం వెళ్లిన ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని నిలిచారు అనేది ఈ చిత్రంలో చూపించినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రంను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున సమర్పించడం విశేషం.