Begin typing your search above and press return to search.
సుశాంత్ ను మళ్లీ చంపొద్దు.. కోర్టుకెక్కనున్న తండ్రి!
By: Tupaki Desk | 23 April 2021 3:30 PM GMTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ను మరోసారి చంపొద్దని అతని తండ్రి కోరుతున్నారు. బాలీవుడ్ లో జరుగుతున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఈ విషయంలో కోర్టు మెట్లు ఎక్కేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
సుశాంత్ గతేడాది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సన్నిహితులతోపాటు ఇతరులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
ఆ తర్వాత కదిలిన డ్రగ్స్ డొంకతో.. తరచూ సుశాంత్ పేరు వార్తల్లోకి వస్తూనే ఉంది. ఇప్పటికి సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ న్యూస్ ఐటమ్ అవుతున్నాడు. ఇలాంటి వార్తలు చూసినప్పుడల్లా కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవడం సహజం.
అయితే.. ఇది చాలదన్నట్టు సుశాంత్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఈ మేరకు బాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్పందించారు. ‘‘మా అబ్బాయి వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా తీసి.. దయచేసి మళ్లీ చంపకండి'' అని కోరుతున్నారు. ఈ ప్రయత్నాలు ఆపకపోతే కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నట్టు సమాచారం.