Begin typing your search above and press return to search.

ఉత్తినే పెళ్లాంపై జోకులేశాడట

By:  Tupaki Desk   |   20 Dec 2016 5:27 AM GMT
ఉత్తినే పెళ్లాంపై జోకులేశాడట
X
సల్మాన్ ఖాన్ సోదరుడిగానే కాకుండా.. టాలీవుడ్ కి కూడా అర్బాజ్ ఖాన్ సుపరిచితుడే. మెగాస్టార్ చిరంజీవి మూవీ జై చిరంజీవలో విలన్ గా నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈయన.. ఇప్పుడు కూడా ఓ తెలుగు సినిమాలో చేస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా ఈయన వివాహం విడాకులకు దారి తీసిన సంగతి తెలిసిందే. కెవ్వు కేక బ్యూటీ మలైకా అరోరాతో విడాకులు తీసుకుంటున్న విషయం ఖాయమైంది. రీసెంట్ గా తన సోదరులు సల్మాన్ ఖాన్.. సోహైల్ ఖాన్ లతో కలిసి.. కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరైన అర్బాజ్.. పర్సనల్ సంగతులు కూడా బోలెడన్ని చెప్పాడు. 'మలైకాతో విడాకులు తీసుకోనుండడంతో.. నా లైఫ్ లోకి వచ్చే కొత్త అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నా' అంటూ అర్బాజ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

అయితే షో నుంచి బయటకు రాగానే మాట మార్చేశాడు అర్బాజ్. 'కాఫీ విత్ కరణ్ 100వ ఎపిసోడ్ కావడంతో అక్కడేదో సరదాగా మాట్లాడానంతే. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేశాం. అక్కడ నేను మాట్లాడినవి సీరియస్ గా తీసుకోకండి. నిజాలే మాట్లాడినా.. వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు' అన్నాడు అర్బాజ్. నిజాలే అంటూ మళ్లీ పట్టించుకోవడంలో అర్ధం లేదని చెప్పడంలో అర్ధమేమి అర్బాజ్ ఖాన్ అంటున్నారు బాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/