Begin typing your search above and press return to search.
ఇన్ని రోజులు తెలంగాణలో ఆంధ్రా సినిమాలు చూడలేదా?
By: Tupaki Desk | 13 July 2019 4:58 AM GMTసంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. ఒక డిస్ట్రిబ్యూటర్ తనతో అన్న మాటల్ని ఆయన చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి. తాజాగా ఆయన దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాను చేశారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సినిమాలో హీరో పాత్రధారి తెలంగాణ యాసలో మాట్లాడతాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన.. సినిమాలో తెలంగాణ యాస ఎక్కువైంది.. మూర్ ముంత..చోడ్ చింత అనే డైలాగ్ ఎవరికి అర్థం కావటం లేదు.. వైజాగ్ ఏరియాలో అంత డబ్బులు రావేమో సార్ అని అన్నాడని.. తెలంగాణ భాష ఆంధ్రాకు అర్థం కాకపోవటం ఏమిటి? అంటూ ప్రశ్నించారు.
ఇన్ని రోజులు తెలంగాణలో ఆంధ్రా సినిమాలు చూడటం లేదా? వైజాగ్ లో 80 శాతం మందికి హిందీ రాకున్నా హిందీ సినిమాలు చూస్తుంటారని.. అంతవరకూ ఎందుకు 40 ఏళ్ల క్రితం అర్థం కాకున్నా తాను వైజాగ్ లో చైనీస్ సినిమాను చూసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా బాగుంటే చూస్తారంతే అంటూ అసలు విషయాన్నిచెప్పిన పూరీ.. సదరు డిస్ట్రిబ్యూటర్ అలా మాట్లాడటం వెనుక డబ్బులు తక్కువ ఇవ్వటం కోసమేనని తేల్చేశారు.
డబ్బు కక్కుర్తి కోసం ఒక బయ్యర్ అన్న ప్రైవేటు మాటల్నితీసుకొచ్చి పబ్లిక్ పంక్షన్ లో ప్రస్తావించటం ద్వారా దీన్నో ఇష్యూగా పూరీ మార్చాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నలు కొందరు వేస్తున్నారు. ఎవరో ఏదో అన్నారని.. ఆ మాటల్ని చెప్పటం.. అవి కాస్తా.. రెండు రాష్ట్రాలకు చెందిన కొందరి మధ్య అనవసర వివాదానికి తెర తీస్తాయన్న విషయాన్ని పూరీ ఎందుకు మర్చిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.