Begin typing your search above and press return to search.

ఆ ట్వీట్స్‌ కు రాత్రి నిద్ర లేదు : అనసూయ

By:  Tupaki Desk   |   21 Feb 2019 9:42 PM IST
ఆ ట్వీట్స్‌ కు రాత్రి నిద్ర లేదు : అనసూయ
X
ప్రముఖ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు టార్గెట్‌ అవుతూనే ఉన్న విషయం తెల్సిందే. అనసూయ ఏ పోస్ట్‌ పెట్టినా ఆమెను విమర్శించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. తాజాగా అనసూయ పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమర జవాన్‌ లకు నివాళ్లు అర్పిస్తూ పోస్ట్‌ చేసింది. ఇంకా పలు వీడియోలు మరియు ఫొటోలను షేర్‌ చేసింది. ఉగ్ర దాడి నేపథ్యంలో అనసూయ చేసిన ట్వీట్స్‌ కు కూడా కొందరు ట్రోల్‌ చేస్తూ కామెంట్స్‌ చేశారట.

తనపై వచ్చిన బ్యాడ్‌ కామెంట్స్‌ కు అనసూయ కలత చెందిందట. కామెంట్స్‌ కు వీడియో రూపంలో సమాధానం ఇచ్చింది. నాకు చాలా మాట్లాడాలని ఉంది, నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తానంటూ మొదలు పెట్టిన అనసూయ మన దేశంలో పట్టించుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఏ సమస్య గురించి మాట్లాడినా చివరకు నా డ్రస్‌ గురించి, నా ప్రొఫెషన్‌ గురించి కామెంట్స్‌ చేయడం అందరికి అలవాటు అయ్యింది. నేను తాజాగా పుల్వామా దాడి గురించి ఒక ఎమోషనల్‌ కామెంట్‌ చేస్తే దానికి కొందరు షోలు చేసుకో వెళ్లు.. పొట్టి డ్రస్‌ లు వేసుకుని స్టేజ్‌ పై స్టెప్పులు వెయ్యి పో అంటూ కామెంట్‌ చేశారు.

ఆ కామెంట్స్‌ కు ఆ రాత్రి నేను నిద్ర కూడా పోలేక పోయాను. అసలు వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏ విషయంలో పోస్ట్‌ చేసినా కూడా చివరకు నా డ్రస్‌ లపై వీరు ఎందుకు కామెంట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న వారు మీ మీ పనులు సక్రమంగా చేసుకుంటున్నారా.. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ ను గౌరవిస్తున్నారా.. నా పని నేను చేసుకుంటున్నాను మరి మీరు మీ పని చేసుకుంటున్నారా అంటూ ఆగ్రహంగా ప్రశ్నించింది. మీరు ఇకనైన మారరా మీ బుద్ది మారదా అంటూ సీరియస్‌ గా కామెంట్‌ చేసింది.