Begin typing your search above and press return to search.

మీ ఇళ్లల్లో లిప్ కిస్సులు పెట్టుకోరా?

By:  Tupaki Desk   |   30 Oct 2017 4:26 AM GMT
మీ ఇళ్లల్లో లిప్ కిస్సులు పెట్టుకోరా?
X
టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక హర్రర్ ఫిల్మ్ ని చూస్తారు అంటున్నాడు గృహం హీరో సిద్దార్థ్. గతంలో టాలీవుడ్ లో ఎన్నో మంచి సినిమాలు చేసి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ లవర్ బాయ్ ఈ సారి భయం వాల్యూ ఏంటో ఈ సినిమా ద్వారా తెలుస్తుందని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక సిద్దార్థ్ ఈ సినిమాకు తన గత చిత్రాలకి చేయని రేంజ్ లో ప్రమోషన్స్ ని చేస్తున్నాడు. అలాగే చిత్ర హీరోయిన్ ఆండ్రియా కూడా ప్రచార కార్యక్రమాల్లో తెగ పాల్గొంటోంది.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఉహించని విధంగా ఆండ్రియా ఆన్సర్స్ ఇచ్చింది. అమ్మడు పోస్టార్స్ లో అలాగే చిత్రం ట్రైలర్స్ లో కొంచెం లిప్ లాక్స్ తో రచ్చ బాగానే చేసింది. దీంతో ఆ విషయం పై కొన్ని ప్రశ్నలు ఎదురవ్వడంతో ' మీ ఇంట్లో మీరందరూ అలాంటి ముద్దులు పెట్టుకోరా?' అని అనడంతో అందరు షాక్ అయ్యారు. ఆండ్రియా గృహం సినిమా సొంత ఇల్లు అనుకొని చేసిందా ఏంటి ? అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.

హిట్లు లేకపోతేనే ఆండ్రియా ఈ రేంజ్ లో కౌంటర్ వేసింది అంటే .. నెక్స్ట్ టైమ్ గ్లామర్ డోస్ ఏ మాత్రం పెంచినా ప్రశ్నించేవాడు జాగ్రత్తగా ఉండలేమో. మొత్తానికి సినిమా నవంబర్ 3న రిలీజ్ చేయడానికి సిద్దార్థ్ ప్లాన్ చేశాడు. ఒకేసారి తెలుగు తమిళ్ లో కూడా రిలీజ్ అవుతోంది. మిలింద్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి సిద్దర్ట్ కి హర్రర్ గృహం ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.