Begin typing your search above and press return to search.
దూకుడు కథ పూర్తిగా నాదే-గోపీ
By: Tupaki Desk | 15 May 2016 5:30 PM GMTమూడేళ్ల కిందట ‘బాద్ షా’ విడుదలకు ముందు టాలీవుడ్లో ప్రకంపనలు రేపిన ఓ ఇంటర్వ్యూలో కోన వెంకట్ అన్న మాటల్ని ఇండస్ట్రీ జనాలకు ఇంకా గుర్తుండే ఉంటాయి. శ్రీను వైట్ల మీద ఆ ఇంటర్వ్యూలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు కోన. తాము కథ-మాటలు రాస్తే వైట్ల క్రెడిట్ తీసుకుంటాడంటూ అతడి పేరు ఎత్తకుండా కోన ఆరోపణలు పెను దుమారమే రేపాయి. ఐతే కోనలా ఆరోపణలేమీ చేయలేదు కానీ.. అతడి సహ రచయిత గోపీమోహన్ కోన మాటలకు బలం చేకూర్చేలా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ‘దూకుడు’ సినిమా గురించి చెబుతూ.. ఈ కథ పూర్తిగా తనదేనని అన్నాడు గోపీ. ఐతే ‘దూకుడు’ టైటిల్స్ లో స్టోరీ క్రెడిట్ శ్రీను వైట్ల వేసుకున్న సంగతి తెలిసిందే. మరి గోపీ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే కోన చేసిన ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇంతకీ దూకుడు గురించి గోపీ ఏమన్నాడో చూద్దాం పదండి.
‘‘నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా దూకుడు. ఆ సినిమా కథ పూర్తిగా నాదే. ‘దూకుడు’లో రియాల్టీ షో ఎపిసోడ్ నాకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. నిజానికి ఈ ఐడియాను ‘దూకుడు’కంటే ముందు చాలామంది దర్శకులకు చెప్పాను. కానీ ఆ సమయానికి వాళ్లెవ్వరికీ అది నచ్చలేదు. ఐతే ఒక రచయితగా నాలో వచ్చిన మంచి థాట్ ను అంతటితో వదిలేయను. మరో సినిమాకు రాస్తున్నప్పుడు ఆ దర్శకుడికి చెబుతాను. ఆ విధంగా ‘దూకుడు’ కథా చర్చల్లో ఉన్నప్పుడు శీను వైట్లకు చెప్పగానే ఆయనకు నచ్చింది. నిజానికి ఈ ఐడియాకు స్ఫూర్తి బాలీవుడ్ మూవీ ‘తరరంపం’. అది హాలీవుడ్ మూవీ ‘పర్ష్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ స్ఫూర్తితో తీశారు. ఆ సినిమాలో పేదరికం ఎలా ఉంటుందో తమ పిల్లలకు చెప్పడానికి రియాల్టీ షో ప్లాన్ చేస్తారు హీరో హీరోయిన్లు. ఇదే ఐడియాను బ్రహ్మానందానికి అప్లై చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాం’’ అని గోపీమోహన్ చెప్పాడు.