Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: రాజు పేద ప్రేమ
By: Tupaki Desk | 6 Jun 2019 6:48 AM GMTయూత్ లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెరంగేట్రం చేస్తున్న ఆనంద్ దేవరకొండను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా దొరసాని. యాంగ్రీ హీరో రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మిక డెబ్యు మూవీగా కూడా దీని మీద ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. దీని టీజర్ ఇందాకా విడుదల చేశారు. అనగనగా తెలంగాణాలో ఓ చిన్న గ్రామం. రాజుగాడు(విజయ్ దేవరకొండ)తన స్నేహితులతో కలిసి రోజులు గడుపుతూ ఉంటాడు. తొలిచూపులోనే ఆ ఊరి పెద్దింటి బిడ్డ దేవకీ(శివాత్మిక)మీద మనసు పారేసుకుంటాడు.
తననే ఫాలో అవుతూ చూపు చూపు కలిపి ప్రేమలో పాడేస్తాడు. స్నేహితులు ముందు ఇది తమాషా అనుకున్నా అదే నిజమవుతుంది. దేవకీ రాజులు ఒకరిని ఒకరు వదిలి ఉండలేని స్థితికి వస్తారు. విషయం బయటపడుతుంది. రాజు ప్రాణాల మీదకు వస్తుంది. ఈ దొరసాని ప్రేమ ఏ తీరానికి చేరుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే
టీజర్ లో మంచి నేటివిటీ ఫీల్ కలిగించారు. స్టొరీ లైన్ మరీ కొత్తది కానప్పటికీ ట్రీట్ మెంట్ పరంగా చూపించిన ఫ్రెష్ నెస్ కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ లేతగా పల్లెటూరి కుర్రాడిగా ఒదిగిపోయాడు. మొదటి సినిమా కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ఆశించడం భావ్యం కాదు. శివాత్మిక లుక్స్ లో దొరసానిని తలపించింది. ఒద్దికగా ఓరకంటితో రాజుని ప్రేమలో పడేసే పాత్రలో మెప్పించేలా కనిపిస్తోంది.
కథను పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం హీరో హీరొయిన్లను మాత్రమే టీజర్ లో చూపించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్న దొరసానికి సన్నీ కొర్రపాటి ఛాయాగ్రహణం మరో ఆకర్షణ. కెవిఅర్ మహేంద్ర దర్శకత్వం సహజత్వానికి అద్దం పట్టింది. సురేష్ బాబు-యష్ రంగినేని-మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.