Begin typing your search above and press return to search.
హీరో ప్రవర్తన సరిగా లేకే సినిమా నుంచి తొలగించారా?
By: Tupaki Desk | 17 April 2021 3:41 AM GMTహీరో దర్శకనిర్మాతల మధ్య సత్సంబంధాలు ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్లడానికి.. పనులన్నీ సజావుగా సాగడానికి చాలా అవసరం. ఏ విషయంలో విభేధాలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ అంపశయ్యపై ఉన్నట్టే. ఇప్పుడు ఆ క్రేజీ సీక్వెల్ హీరో - నిర్మాత మధ్య విభేధాలతో గాల్లో వేలాడుతోందని సమాచారం. నిర్మాతతో సత్సంబంధాలు కొనసాగించనందుకు అలాగే కాల్షీట్లు కేటాయించనందుకు ఆ ప్రాజెక్ట్ నుంచి అర్థాంతరంగా ఆ యువహీరోని తొలగించడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
ఇంతకీ ఇది ఏ ప్రాజెక్ట్ .. హీరో ఎవరు..? నిర్మాత ఎవరు? అన్నది ఆరా తీస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి. రెండేళ్లుగా నిరంతరం ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లో నిలుస్తున్న క్రేజీ సీక్వెల్ దోస్తానా 2 విషయంలో హీరో- నిర్మాతల మధ్య తకరారు సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్స్ కొన్ని చిత్రీకరించాక ఇప్పుడు హీరో కార్తీక్ ఆర్యన్ ని అర్థాంతరంగా ఈ సినిమా నుంచి తొలగించారు. ఆ మేరకు ప్రముఖ జాతీయ మీడియా కథనాలు సంచలనంగా మారాయి.
2019లోనే కార్తీక్ ఆర్యన్ దోస్తానా 2 టీమ్ లో చేరారు. అయితే గత సంవత్సరం కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం నిలిచిపోయింది. కట్ చేస్తే తాజా నివేదిక ప్రకారం.. కార్తీక్ కి ఈ చిత్రంతో ఇక ఏ సంబంధం లేదు. ఈ నిర్ణయం వెనుక కారణం కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్ల మధ్య సృజనాత్మక విభేధాలు తలెత్తాయి. ధర్మ ప్రొడక్షన్స్‌కు దగ్గరగా ఉన్న ఒక సోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
కార్తీక్ ఆర్యన్ కి చెందిన టాలెంట్ ఏజెన్సీ ఈ చిత్రానికి కాల్షీట్లు ఇవ్వడం లేదట. అందువల్ల ప్రొడక్షన్ హౌస్ కార్తీక్ ఆర్యన్ స్థానంలో వేరొక హీరోతో భర్తీ చేయాలని నిర్ణయించిందిని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ సజావుగా సాగకపోవటానికి కారణం ఒకటిన్నర సంవత్సరాల తరువాత సృజనాత్మక విభేధాలు తలెత్తడమేనని హీరో వైపు నుంచి వెల్లడైంది. 20 రోజుల షూట్ పూర్తయ్యాక అతడు వైదొలగుతున్నారని తెలిసింది.
ధర్మ ప్రొడక్షన్స్ హిస్టరీలోనే ఇలాంటిది తొలిసారి. ఒక నటుడు సృజనాత్మక విభేధాలతో సినిమా నుండి బయటకు వెళ్ళిపోవడం అన్నది ఇదే తొలిసారి. భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయకూడదని ధర్మ సంస్థ నిర్ణయించింది. అయితే విభేధాలకు ఇరువర్గాల చెడు ప్రవర్తన కారణమా? లేక కేవలం హీరో తప్పు చేశాడా? అన్నది మూడో వ్యక్తి నిర్ధారించడం సరికాదన్న అభిప్రాయం కార్తీక్ అభిమానుల్లో ఉంది.
దోస్తానా 2 కి కొల్లిన్ డి కున్హా దర్శకుడు. జాన్వి కపూర్ కథానాయిక. ఈ చిత్రంతోనే టీవీ స్టార్ లక్ష్య లాల్వాని బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ స్థానంలో ఏ హీరో వస్తారు? జాన్వీతో జోడీ కట్టేది ఎవరు? అన్నది తేలాల్సి ఉంది.
COVID-19 నుండి ఇటీవల కోలుకున్న కార్తీక్ ఆర్యన్ తన తదుపరి చిత్రం `ధమకా` డబ్బింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్ తదుపరి హర్రర్ కామెడీ `భూల్ భూలైయా 2` లో కనిపించనున్నారు. ధర్మాధినేత కరణ్ జోహార్ పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ కి పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ధర్మ సంస్థలో పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.