Begin typing your search above and press return to search.
దోస్తీ ఫుల్ క్రెడిట్ ను కొడుక్కు ఇచ్చేసిన జక్కన్న
By: Tupaki Desk | 2 Aug 2021 10:40 AM GMTరాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి స్నేహితుల దినోత్సవం సందర్బంగా విడుదల అయిన మ్యూజికల్ వీడియో సాంగ్ ను ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ.. తమిళం.. కన్నడం.. మలయాళం భాషల్లో కూడా ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సంగీతంతో పాటు అద్బుతమైన సాహిత్యం కన్నుల వింధుగా ఉన్న విజువల్స్ చివర్లో ఇద్దరు హీరోలు కలిసి రావడం.. అయిదుగురు పెద్ద సింగర్స్ తో కలిసి కీరవాణి పాటను చేయడం వంటి కారణాల వల్ల ఈ మ్యూజికల్ వీడియో స్థాయి అమాంతం పెరిగింది. పాటే ఇలా ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను కూడా ఇంత అద్బుతంగా చేసిన జక్కన్న గ్రేట్ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో కీరవాణి సోషల్ మీడియాలో పాట క్రెడిట్ ను తన కొడుకు కార్తికేయకు మరియు కొరియోగ్రాఫర్స్ కు ఇచ్చేశాడు.
పాటకు వస్తున్న స్పందన నేపథ్యంలో జక్కన్న స్పందించాడు.. ఆయన ట్విట్టర్ లో... ఈ మ్యూజిక్ వీడియో చిత్రీకరణ ఐడియా కార్తికేయది. నేను ఆర్ ఆర్ ఆర్ సినిమా క్లైమాక్స్ సాంగ్ షూటింగ్ లో ఉన్నాను. ఆ సమయంలో కార్తికేయ మరియు సతీష్.. దినేష్ కృష్ణనన్ లతో ఈ పాటను చేశాడు. చాలా బాగా చేశారంటూ అబ్బాయిలకు కితాబిచ్చాడు. ఇంత మంచి స్పందన రావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతటి అనూహ్య స్పందన వస్తుందని నేను ఊహించలేదు అంటూ రాజమౌళి ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశాడు. షో రీల్స్ ద్వారా ప్రోమోలను కట్ చేయడం మొదలుకుని మంచి ప్రమోషనల్ వీడియోలను చేయడం లో కార్తికేయ సిద్ద హస్తుడు. అలాంటి కార్తికేయ ఈ సినిమాలోని ఈ పాటను ఇలా ప్రేక్షకులముందుకు తీసుకు రావడంతో ఎప్పటిలాగే సూపర్ హిట్ అయ్యింది.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు పాట చివర్లో కనిపించడం మొదలుకుని సెట్ డిజైన్ మరియు కెమెరా ఇంకా మొత్తం వర్క్ కూడా కార్తికేయ ఐడియాగా తెలుస్తోంది. ఇలాంటి ఒక పాటను సింగర్స్ అందరితో కలిసి షూట్ చేయవచ్చు అనే ఐడియా రావడం చాలా గొప్ప విషయం. ఇప్పటి వరకు ఇలాంటి ఐడియాతో ఎవరు రాలేదు అనడంలో సందేహం లేదు. మొత్తానికి దోస్తీ ఫుల్ సక్సెస్ క్రెడిట్ మొత్తం కూడా కార్తికేయకు చెందుతుందన్నమాట. పాట విన్న తర్వాత సినిమా ఇంకెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సినిమాకు ఇదో శాంపిల్ అన్నట్లుగా అభిమానులు ఆసక్తితో ఉన్నారు.